Begin typing your search above and press return to search.

అడ్డంగా దొరికిపోయిన ‘ముఖ్యమంత్రి’

By:  Tupaki Desk   |   21 Nov 2016 4:22 PM GMT
అడ్డంగా దొరికిపోయిన ‘ముఖ్యమంత్రి’
X
చేసిన తప్పునే మళ్లీ.. మళ్లీ చేయటం కొందరికి అలవాటు. సాదాసీదా మనిషి ఇలాంటి తప్పులు చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు.కానీ.. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. కక్కుర్తితో అడ్డంగా బుక్ అయిపోవటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కమ్ ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఒక చిత్రమైన అలవాటు ఉంది. తన తప్పుల్ని చూసుకోని ఆయన.. ఇతరుల తప్పుల్ని.. మరి ముఖ్యంగా ప్రధాని మోడీ తప్పుల్ని ఎత్తి చూపేందుకు విపరీతంగా తపిస్తుంటారు. ఇందుకోసం ఆయన ఇరవైనాలుగు గంటలు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ క్రమంలో కొన్ని తప్పులు చేసి.. అడ్డంగా బుక్ అయిపోతుంటారు.

తాజాగా అలాంటి తప్పే మరోసారి చేసి దొరికిపోయారు. తరచూ మోడీని ఏదో ఒక విమర్శతో ముడిపెట్టి.. నోటికి వచ్చినట్లుగా తిట్టేసే అలవాటు కేజ్రీవాల్ కు ఎక్కువే. తిట్టాలన్నఆత్రంలో తాను చెప్పే వాదనకు సరిపడా ఫోటోలు వెతుక్కునే క్రమంలో ఆయన తరచూ తప్పులు చేస్తుంటారు. ఆయనకు ఫోటోలు వెతుక్కోవటం రాకపోవటమో.. లేక గూగులమ్మ చూపించే ప్రతి ఫోటోను మోడీకి లింకెట్టి చూపాలని అనుకుంటారో కానీ.. సంబంధం లేని ఫోటోల్ని పోస్ట్ చేసి.. దొరికిపోతుంటారు.

తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. పెద్దనోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ.. నాలుగు రోజులుగా బ్యాంకు వద్ద డబ్బు కోసం పడిగాపులు కాసి.. చివరకుడబ్బుఅందకపోవటంతో సూసైడ్ పెట్టిన యువకుడు అంటూ ఒక క్యాప్షన్ పెట్టేశారు. ఇంతకీ ఆ ఫోటోలు ఎక్కడిదన్నది చెక్ చేస్తూ.. భేలా అనే గ్రామంలో అలహాబాద్ బ్యాంకు వద్దకు వచ్చిన యువకుడు దొంగతానికి ప్రయత్నించాడు. అయితే.. అతగాడ్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో.. తాను పట్టుబడిపోతానన్న ఉద్దేశంతో ఆత్మహత్యకుపాల్పడ్డాడు. అలాంటి యువకుడి ఫోటోను పెట్టుకొని.. డబ్బుల కోసం వెయిట్ చేసి.. డబ్బులు దొరక్క ఆత్మహత్య చేసుకున్న యువకుడిగా అభివర్ణించారు.

ఇదొక్కటేకాదు.. యూపీలో నిన్న జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ కు సంబంధించి ఒక ఫోటోను పోస్ట్ చేసిన కేజ్రీవాల్.. రైలు ప్రమాదంలో అనాధలుగా చిన్నారుల ఫోటో అంటూ పోస్ట్ చేశారు. కానీ.. ఆ ఫోటో సిరియా శరణార్థులది కావటం గమనార్హం. ఇలా తప్పుల మీద తప్పులు చేసి దొరికిపోవటం మరే ముఖ్యమంత్రికి సాధ్యం కాదేమో. ఆయన తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రశ్నించిన వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా.. తాను పోస్ట్ చేసిన పోస్టులను గుట్టుచప్పుడు కాకుండా డిలీట్ చేసేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/