Begin typing your search above and press return to search.

బ్రేకింగ్..ఆ సీఎంకు అస్వస్థత..అన్ని ప్రోగ్రాంలు రద్దు

By:  Tupaki Desk   |   8 Jun 2020 9:05 AM GMT
బ్రేకింగ్..ఆ సీఎంకు అస్వస్థత..అన్ని ప్రోగ్రాంలు రద్దు
X
అంతకంతకూ విస్తరిస్తున్న మాయదారి రోగం దేశంలో తొలిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ వెళ్లిందా? అన్నదిప్పుడు సందేహంగా మారింది. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు కాస్త కంట్రోల్ లో ఉన్నట్లు కనిపించిన ఈ మహమ్మారి.. అన్ లాక్ 1.0 మొదలైన నాటినుంచి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం జడలు విప్పినట్లుగా పరిస్థితి మారుతోంది.

ఇదిలా ఉంటే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయనకు ఇప్పటివరకూ పరీక్ష చేయలేదు. కాకుంటే.. ఆయనకున్న ఆరోగ్య సమస్యల్ని చూస్తే.. జ్వరం.. గొంతునొప్పి ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు మంగళవారం టెస్టు చేయాలని నిర్ణయించారు.

కొంత కాలంగా కజ్రీవాల్ ఆస్తమాకు మందులు వాడుతున్న సంగతి తెలిసిందే. దేశంలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న మహా నగరాల్లో ఒకటిగా ఢిల్లీ చెబుతున్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకూ 27,654మందికి పాజిటివ్ రాగా.. వారిలో 10,664 మంది కోలుకున్నారు. 761 మంది మరణించారు. ఢిల్లీ సీఎం హోం క్వారంటైన్ కు వెళ్లటంతో ఆయన తన అధికారిక కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకున్నారు. ఇప్పుడీ ఉదంతం సంచలనం గా మారింది.