Begin typing your search above and press return to search.
కేజ్రీవాల్ విజయం.. కేసీఆర్ కు గుణపాఠమేనా?
By: Tupaki Desk | 11 Nov 2019 9:26 AM GMTవందలకు పైగా దేశాలు.. దేశంలోని రాష్ట్రాలన్నీ తలపట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలు పీడించబడ్డాయి. ముఖ్యంగా తెలంగాణలో డెంగ్యూ వల్ల మరణ మృందంగం కొనసాగుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ డెంగ్యూ బారిన పడుతున్నారు. తాజాగా ఓ ఎల్ కేజీ పిల్లాడు డెంగ్యూ బారిన పడి అది మెదడుకు ఎక్కి చావుబతుకుల మధ్య ఉంటే ఆ పాఠశాల విద్యార్థులంతా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి విరాళాలు సేకరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అయితే ప్రపంచంలోని వందకుపైగా దేశాలు, తెలుగు రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న డెంగ్యూను ఢిల్లీ జయించింది. అక్కడి సీఎం, ప్రజలు చేపట్టిన చర్యలతో డెంగ్యూ దేశ రాజధానిలో లేకుండా పోయింది.
ఢిల్లీలో పారిశుధ్యానికి సీఎం కేజ్రీవాల్ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అధికారులు , మున్సిపల్ సిబ్బందియే కాదు.. ప్రజలను భాగస్వాములు చేసి డెంగ్యూ దోమలు నివసించకుండా అన్నింటిని శుభ్రం చేయించారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇందులో భాగస్వాములయ్యారు. దీంతో ఏడాదిలో డెంగ్యూపై యుద్ధంలో ఢిల్లీ వాసులు గెలిచారు. అక్కడ కేవలం 1100 కేసులు నమోదైతే ఒక్కరు కూడా డెంగ్యూతో చనిపోలేదు. తెలంగాణలో ఇప్పటికే డెంగ్యూ మరణాల సంఖ్య 1000 దాటిందని సమాచారం.
తెలంగాణలోని పెద్ద పల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవ సేన కూడా స్వచ్ఛతలో జిల్లాను ముందు నిలిపి జాతీయ స్థాయిలో స్వచ్ఛత అవార్డును పొందారు. ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఆమెను అభినందించారు. అలాంటి పెద్దపల్లి జిల్లాలో కేవలం 10 డెంగ్యూ కేసులు మాత్రమే నమోదయ్యాయట.. అసలు మరణాలే సంభవించలేదు. కలెక్టర్ , ప్రజలు స్వచ్ఛతలో శుభ్రంగా ఉండడంతో తెలంగాణ మొత్తం డెంగ్యూ కబలిస్తున్నా పెద్దపల్లిలో మాత్రం ఆ జాడ లేదు..
ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ ఈ విషయంలో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. పుట్టెడు సమస్యల్లో ఉన్న కేసీఆర్ ఈ డెంగ్యూ మరణాలపై సీరియస్ గా దృష్టిసారించే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు. కానీ ప్రజల ప్రాణాలు తీస్తున్న డెంగ్యూ పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛతలో తెలంగాణను ముందుంచితే ఈ మరణాలకు అడ్డుకట్టపడుతుంది. కేజ్రీవాల్ చూపిన బాటలో నడిస్తే అసలు రోగాలే రావనడంలో ఎలాంటి సందేహం లేదు.