Begin typing your search above and press return to search.

ఆత్మాహుతి దాడి.. 15మంది మృతి

By:  Tupaki Desk   |   16 Jan 2019 11:42 AM IST
ఆత్మాహుతి దాడి.. 15మంది మృతి
X
కెన్యా రాజధాని నైరోబీలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ హోటల్ టార్గెట్ గా రెచ్చిపోయారు. నైరోబీ లోని వెస్ట్ ల్యాండ్స్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ‘డస్టిట్ డీ2’ హోటల్ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి ముష్కరులు ప్రవేశించారు. పార్కింగ్ ప్రాంతంలో బాంబులు విసిరారు. అనంతరం బాంబులు అమర్చుకొని వచ్చిన ఓ దుండగుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో మొత్తం 15మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

దాడి అనంతరం కూడా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడి సమాచారం అందుకున్న వెంటనే హోటల్ కాంప్లెక్స్ ను భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేశాయి.. ఈ ఘటనకు తామే బాధ్యులమని తాజాగా ఉగ్రవాద సంస్థ ‘అల్-షబాబ్ ’ ప్రకటించింది.