Begin typing your search above and press return to search.
ఓటు వేయకుంటే సెక్స్ చేయద్దంటున్న నేత
By: Tupaki Desk | 19 Jan 2017 5:45 AM GMTఎన్నికల్లో ఓటుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా మళ్లీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నాయకులంతా ఆ ఒక్కరోజు వరకు ఓటరును ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా చూస్తుంటారు. అలాంటి ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ కెన్యాకు చెందిన ఓ మహిళా ఎంపీ వినూత్న ప్రచారం చేపట్టారు. దేశంలోని మహిళలంతా తమ భర్తలు ఓటు హక్కు పొందే వరకు శృంగారానికి అంగీకరించవద్దని పిలుపునిచ్చారు.
కెన్యాలోని మొంబాసా తీరనగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ మిషీ మోకో ఇటీవల ఓటరు అవగాహన సదస్సులో మాట్లాడుతూ ఈ మేరకు కొత్త పిలుపు ఇచ్చారు. 'భర్తల్లో మార్పు వచ్చేలా దానిని మహిళలు ఆయుధంగా వాడుకోవాలి. తమ భర్తలు ఓటరు కార్డు చూపించే వరకు శృంగారాన్ని నిరాకరించండి. నా భర్తకు ఆ సమస్య లేదు. ఎందుకంటే ఆయనకు ఓటరు కార్డు ఉంది' అని చమత్కరించారు. కెన్యాలో ఆగస్టు ఎనిమిదిన పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. దేశంలో సుమారు 90 లక్షల మంది అర్హత ఉండి ఓటుహక్కు నమోదుకు ఆసక్తి చూపడం లేదు. ఓటరు నమోదు గడువు ఫిబ్రవరి 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సదరు మహిళా నేతిలాంటి పిలుపు ఇచ్చారు.