Begin typing your search above and press return to search.
ఊపందుకుంటున్న కారవాన్ టూరిజం
By: Tupaki Desk | 17 Jun 2022 4:30 AM GMTటూరిజం శాఖను విస్తరించటం, టూరిజం ఆదాయాన్ని అందుకోవటం, మంచి మంచి టూరిజం ప్యాకేజీలను ప్రకటించి నూరుశాతం అమలు చేయటంలో కేరళ ప్రభుత్వం తర్వాతే ఏ రాష్ట్రమైనా. కేరళకు దేవభూమి అనే పేరు సార్ధక నామధేయం గా మారిపోయింది.
నదులు, పెద్ద పెద్ద జలపాతాలు, ఎత్తైన కొండలు, బ్యాక్ వాటర్స్ అవకాశమున్న నదులు, టీ, కాఫీ తోటలు, ఫాం హౌసులు, మంచు కురిసే ఎత్తైన ప్రాంతాల్లో రిసార్టులు, మెడికల్ టూరిజం, ఆయుర్వేద వైద్యం లాంటి ఎన్నో ప్రత్యేకతలకు కేరళ పెట్టింది పేరు.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి కేరళ రాష్ట్రం ప్రతియేటా లక్షలాది టూరిస్టులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే నదుల్లో బోట్ టూరిజంను బాగా డెవలప్ చేసిన కేరళ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తొందరలోనే కారవాన్ టూరిజం మొదలవ్వబోతోంది. ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీకి లేదా పరిమిత సంఖ్యలోని వారు ప్రయాణం చేయటానికి కారవాన్ టూరిజంను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి మహ్మద్ రియాజ్ చెప్పారు. కారవాన్ టూరిజంలో ప్రయాణించేవారు బుక్ చేసుకున్న రూటులో హోటళ్ళు అవసరం లేదు, బయట ఎక్కడో ఫుడ్ కోసం వెతుక్కోవక్కర్లేదు.
కారవాన్ అంటే బస, వసతి, భోజనం లాంటి అన్నీ సౌకర్యాలున్న పెద్ద పెద్ద బస్సులన్నమాట. ప్రస్తుతం ఇలాంటి కారవాన్లు సినిమా స్టార్లు, పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కారవన్లంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే సినిమాల్లోను, టీవీల్లోను చూసేవుంటారు. అయితే ప్రత్యక్షంగా అనుభవించాలంటే మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే సకల సౌకర్యాలు ఉన్న ఒక్కో కారవాన్ కోట్ల రూపాయల ఖరీదు చేస్తుంది.
ప్రస్తుతం వ్యక్తిగత హోదా కోసం మాత్రమే స్టార్లు, పారిశ్రామికవేత్తలు ప్రత్యేకించి తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెడీ చేయించుకుంటున్నారు. అలాంటి సౌకర్యాలున్న కారవాన్లను ప్రభుత్వమే రెడీచేస్తోంది. సుమారు 150 కారవాన్ పార్కులను రెడీచేయబోతున్నట్లు మంత్రి తెలిపారు.
కారవాన్ టూరిజంను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రైవేటు సంస్ధలకు రు. 2-75 లక్షల వరకు ప్రోత్సాహకాలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఒక కారవాన్ పార్కు ఏర్పాటైందట. కొన్ని కారవాన్లు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. అయితే వీటిని బాగా పెంచటం కోసమే ప్రోత్సాహకాలిస్తున్నట్లు చెప్పారు. కాబట్టి ఎగువ మధ్య తరగతి జనాలు కూడా కారవాన్లు బుక్ చేసుకుని ఎంజాయ్ చేయచ్చు ఇకనుండి.