Begin typing your search above and press return to search.
చెన్నై అపోలోలో మరో రాష్ట్ర సీఎం!
By: Tupaki Desk | 3 March 2018 7:16 AM GMTట్రాక్ రికార్డు చూస్తే చెన్నై అపోలోను వేలెత్తి చూపించలేని పరిస్థితి. అయితే.. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితను అపోలో ఆసుపత్రికి తీసుకురావటం దగ్గర నుంచి.. ఆమె మరణం ఎపిసోడ్ వరకూ చూస్తే.. భారీగా పాపులర్ అయ్యిందేమైనా ఉందంటే.. అది అపోలో ఆసుపత్రి.
భారీ కార్పొరేట్ ఆసుపత్రిగా పేరున్న అపోలో ఆసుపత్రిలో అమ్మ చికిత్స పొందుతున్న బ్లాక్ మొత్తాన్ని ఖాళీ చేయించటమే కాకుండా ప్రత్యేక భద్రతనుఏర్పాటు చేశారు. ఇంత చేసినా.. అమ్మ ఆరోగ్యంగా తిరిగి వెళితే బాగుండేది. కానీ.. అనూహ్యంగా ఆమె మరణించటం.. ఆమె ట్రీట్ మెంట్ కు సంబంధించి పలు సందేహాలు అపోలో మీద విమర్శలు చేసే అవకాశాన్ని ఇచ్చాయి.
ఇదిలాఉంటే.. మరోసారి చెన్నై అపోలో ఆసుపత్రి వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే.. ఈసారి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ రోజు (శనివారం) అస్వస్థతకు గురయయారు.దీంతో.. శనివారం ఉదయం కేరళ నుంచి హుటాహుటిన ఆయన్ను చెన్నై అపోలోకు తరలించారు. ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యానికి గురైన విజయన్ కు ప్రత్యేక వైద్య బృందం చికిత్స చేస్తున్నారు. ఇదిలా ఉంటే..సీఎం విజయన్ అనారోగ్యానికి గురైనట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఆయన రెగ్యులర్ చెకప్ లో భాగంగానే చెన్నై అపోలోకు వచ్చినట్లుగా చెబుతుననారు. ఇంకోవైపు అపోలో వర్గాలు సైతం కేరళ సీఎం పరీక్షల కోసం వచ్చారన్న మాటను చెబుతున్నారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం చూస్తే.. సీఎం విజయన్ ఆసుపత్రిలోకి వెళ్లారే కానీ.. ఆసుపత్రిలో చేరలేదని స్పష్టం చేస్తున్నారు.