Begin typing your search above and press return to search.
నిరాడంబరంగా కేరళ సీఎం కుమార్తె పెళ్లి !
By: Tupaki Desk | 15 Jun 2020 10:50 AM GMTకేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆడంబరాలకు దూరంగా ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఆయన కుమార్తె వివాహం విషయంలో కూడా ఈ విషయం వెల్లడైంది. సోమవారం తిరువనంతపురంలో ఆయన పెద్ద కుమార్తె వీణ వివాహం సీపీఐఎం యువజన విభాగం డీవైఎఫ్ ఐ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది మహ్మద్ రియాజ్ తో జరిగింది. ఈ శుభకార్యానికి లాక్ డౌన్ అమలులో ఉండటంతో కేవలం కుటుంబసభ్యులు, కొంతమంది అతిధులు మాత్రమే హాజరయ్యారు.
ఈ కార్యక్రమం అత్యంత నిరాడంబరంగా జరిగింది. బంధువులు, అతిథులు భౌతికదూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి ఈ వేడుకలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి విజయన్ నివాసం వద్దే ఈ వివాహం జరిగింది. కాగా వీణ, రియాజ్ లకు ఇది రెండో వివాహం. మొదటి వివాహంలో వీణకు ఒకరు, రియాజ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రియాజ్ 2009 లోక్ సభ ఎన్నికల్లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎమ్) అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. రియాజ్ 2017లో డీవైఎఫ్ ఐ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. కేరళ తో పాటు పశ్చిమ బెంగాల్, త్రిపుర లో డీవైఎఫ్‌వై యాక్టివ్ గా ఉంది.
ఇక, పినరయ్ విజయన్, కమల విజయన్ దంపతుల పెద్ద కుమార్తె వీణ... ఒరాకిల్ లో చాలా కాలం పాటు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేశారు. తర్వాత బెంగళూరు లో సొంతంగా స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు. ఎక్జాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు తో ప్రారంభించిన ఆ సంస్థకు ఆమె మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సంస్థను విజయవంతంగా నడిపిస్తూ.. గుర్తింపు పొందారు.