Begin typing your search above and press return to search.
కేరళలో సెక్స్ పాలిటిక్స్
By: Tupaki Desk | 30 Jan 2016 10:14 AM GMTకేరళ రాజకీయాలను సోలార్ కుంభకోణం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సరిత నాయర్ కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుమారుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సీఎం కుమారుడికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని... అందుకు ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె ఆరోపిస్తున్నారు. సీఎం కొడుకుతో లింకు ఉన్న ఆ మహిళ కూడా ఈ కేసులో నిందితురాలేనని చెప్పారు. చాందీ కుమారుడు - ఆమె మధ్య బాగా సన్నిహితంగా ఉన్న సంబంధానికి సంబంధించిన ఫొటోలు - వీడియోలు కేరళ హోంమంత్రి రాధాకృష్ణన్ వద్ద ఉన్నాయని సరిత వెల్లడించారు. హోంమంత్రి దగ్గర ఉన్న ఆధారాలను ముఖ్యమంత్రిని బ్లాక్ మెయిల్ చేసేందుకు వాడుకుంటున్నారని చెప్పారు. అయితే సీఎం కుమారుడితో తనకు అక్రమ సంబంధం ఉందన్న ఆరో్పణలను మాత్రం ఆమె కొట్టిపారేశారు. తనకు జూనియర్ చాందీతో కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని.... ఆ సంబంధం మాత్రం లేదని చెప్పారు.
కాగా సోలార్ కుంభకోణంపై ఏర్పాటైన విచారణ కమిషన్ ముందు వరుసగా మూడో రోజున సరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కుంభకోణానికి సంబంధించిన అనేక అంశాలను వెల్లడించారు. తాజాగా సెక్స్ ఆరోపణలు - సెక్స్ వీడియోలు ఉన్నాయని చెప్పడంతో... అవి ఎప్పటికైనా బయటపడేవేనని.. కాబట్టి కుంభకోణం ఇంకా అనేక మలుపులు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి సరితా నాయర్ కేరళ రాజకీయాలను ఒక ఆట ఆడించేస్తోంది. ఇంతచేసిన సరిత సీఎం కుమారుడితో తనకు ఉన్నది వ్యాపార సంబంధం మాత్రమే అని చెబుతుంటే మాత్రం కేరళలో రాజకీయవర్గాలు నమ్మలేకపోతున్నాయట.