Begin typing your search above and press return to search.
శశిథరూర్ తీరుపై కాంగ్రెస్ లో తీవ్ర వ్యతిరేకత!
By: Tupaki Desk | 28 Aug 2019 8:43 AM GMTప్రభుత్వం చేసిన మంచి పనులను మనం గుర్తించి తీరాలి. లేకపోతే ప్రజల నుంచి మనమే వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి ఉంటుంది..' అంటూ తన పార్టీ శ్రేణులను ఉద్దేశించి శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో వివాదంగా మారాయి. ఎంపీ హోదాలో ఉన్న శశి అలా మాట్లాడటంపై కాంగ్రెస్ వాళ్లు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో శశిథరూర్ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ కేరళ విభాగం ఒక ప్రకటన కూడా చేయడం విశేషం.
మోడీ ఏం చేసినా తప్పు పట్టాల్సిందే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ఈ విషయంలో శశిథరూర్ తీరును తప్పు పడుతూ ఉంది. ఈ విషయంలో ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మోడీ వరసగా ఇస్తున్న వరస స్ట్రోక్స్ తో కాంగ్రెస్ పార్టీ కుదేల్ అవుతోంది. వరసగా రెండో సారి కాంగ్రెస్ చిత్తు అయ్యింది.
ఇలాంటి క్రమంలో భవిష్యత్తుపై కాంగ్రెస్ లో బెంగ మొదలైంది. ఈ నేపథ్యంలో మోడీ విధానాలను తూర్పారపట్టాలని కాంగ్రెస్ అనుకుంటోంది. అయితే ఉన్నట్టుంది శశిథరూర్ లాంటి వాళ్లు ఈ ప్రకటనలు చేయడంతో ఆ పార్టీలో వారిపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
అయితే తన తీరును శశిథరూర్ సమర్థించుకుంటున్నాడు. తను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని ఆయన అంటున్నాడట. తను కాంగ్రెస్ విధానాల వాడినే అని, అయితే మంచి పనులు చేసినప్పుడు మెచ్చుకోకపోతే, తప్పులు చేసినప్పుడు గట్టిగా ఖండించడానికి అవకాశం ఉండదనేది ఆయన వాదన. అయితే ఆయన వాదనతో కాంగ్రెస్ వాళ్లు ఏకీభవించలేకపోతున్నట్టున్నారు!