Begin typing your search above and press return to search.
ఈ ప్రేమకథ చాలా చాలా వెరైటీ
By: Tupaki Desk | 23 Aug 2017 5:07 AM GMTప్రేమకథలకు కొదవలేదు. కానీ.. ఏ ప్రేమకథ గురించి విన్నా.. మళ్లీ వినిపించాలనిపిస్తుంది. అదే ప్రేమకథ గొప్పతనం. మీరు ఇప్పటికి చాలానే ప్రేమకథల గురించి విని ఉంటారు. కానీ.. ఇప్పుడు మేం చెప్పే ప్రేమకథ లాంటి దాన్ని మీరు ఎప్పుడూ విని ఉండరు. చూసి ఉండరుకూడా. ఇక.. ఈ వెరైటీ ప్రేమకథలోకి వెళితే..
ఈ ఇద్దరికి ఒకరికొకరు అస్సలు తెలీదు. కానీ.. వారిద్దరికి కామన్ ఇంట్రస్ట్ ఏమిటంటే.. తాము ఉన్న మాదిరి కాకుండా భిన్నంగా మారాలనుకున్నారు. ఆ అబ్బాయికి అమ్మాయిగా మారాలనుంటే.. ఆ అమ్మాయికి అబ్బాయిగా మారాలని ఉంది. ఇలా అనుకున్న ఇద్దరూ తమకు తెలీకుండానే ముంబయిలోని ఒక లింగమార్పిడి క్లినిక్ కు వెళ్లారు. అక్కడే ఒకరికొకరు పరిచయం అయ్యారు.
వారిద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది. వారు అనుకున్నట్లే లింగమార్పిడి చేసుకున్నారు. అప్పటివరకూ ఉన్న అబ్బాయ్ అమ్మాయిగా మారితే.. అమ్మాయి అబ్బాయిగా మారిపోయారు. ఇరువురి మధ్య పెరిగిన ప్రేమ అంతకంతకూ పెరిగిపోయింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవటం.. అందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరటంతో వీరి వ్యవహారం బయటకు వచ్చింది.
ముంబయికి చెండిన అప్పు కుట్టన్ అనే మహిళ.. సుకన్య క్రిష్ణ అనే యువకుడు లింగమార్పిడి కోసం ఒక క్లినిక్ కు వెళ్లటం.. అక్కడ మొదలైన వీరి ప్రేమ గడిచిన మూడేళ్లుగా.. లింగమార్పిడి జరిగిన తర్వాతా కంటిన్యూ అవుతోంది. తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పురుషుడిగా మారిన 46 ఏళ్ల అప్పు కుట్టన్ చెబుతున్నారు. తన జీవితం మొత్తం సుకన్య క్రిష్ణన్ తో గడపాలని కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు. తాము లింగమార్పిడి చేయించుకున్ననేపథ్యంలో తమ పెళ్లికి ప్రభుత్వ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమకు పిల్లల్ని కనాలని ఉన్నా.. తమకున్న శారీరక ఇబ్బందుల దృష్ట్యా ఒకరిని దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. వీరి పెళ్లికి ప్రభుత్వ అనుమతి వస్తుందా? సమాజంలో వీరికి ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.