Begin typing your search above and press return to search.
'ఫామ్‌హౌజ్' ఎమ్మెల్యే కేసు.. కేరళ దాకా పాకిందే!
By: Tupaki Desk | 14 Nov 2022 7:30 AM GMTమునుగోడు ఉప ఎన్నికకు ముందు.. మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేంద్రంగా టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలుకు ప్రయత్నించారన్న కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వరుస సోదా లు చేస్తోంది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌కి చెందిన ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపారసంస్థలు, ఆశ్రమాల్లో రెండురోజులుగా తనిఖీలు కొనసాగాయి. తనిఖీల కోసం 7 బృందాలను ఏర్పాటు చేశారు. తెలుగురాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, హరియాణలోనూ తనిఖీలు నిర్వహించాయి.
ఈ కేసులో కేరళలోని ఓ వైద్యుడి ప్రమేయాన్ని గుర్తించారు. దీంతో ఆయనకు ఈ కేసుతో ఉన్న సంబంధా లపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే వ్యవహారానికి సంబంధించి కీలక సమా చారం లభ్యమైనట్టు తెలుస్తోంది. కేరళకు చెందిన తుషార్‌కు.. రామచంద్రభారతికి సంబంధాలు ఉన్నాయి. ఆయనతో ఫోన్‌లో మాట్లాడించారు. అదేవిధంగా తుషార్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని కూడా సిట్ అధికారులు మాట్లాడించారు.
ప్రలోభాల పర్వంలో తుషార్ పాత్ర ఏంటనే అంశంపై, పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న తుషార్‌ను, రామచంద్రభారతికి పరిచయం చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఆ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని నిర్ణయించారు. తుషార్‌కు నోటీసులు ఇచ్చి విచారిస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇక, ఈ కేసులో పాత్ర ఉందని భావిస్తున్న కేరళ వైద్యుడి విషయం కూడా అధికారులు తీవ్రంగానే పరిగణిస్తున్నారు. అయితే, అధికారులు వచ్చిన విషయం తెలుసుకున్న వైద్యుడు పరారైనట్లు సమాచారం. పోలీసులు వస్తున్నట్లు వైద్యుడికి ఆశ్రమ పర్యవేక్షకుడు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కేరళ పోలీసుల సాయంతో సిట్ అధికారులు పర్యవేక్షకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి వైద్యుడికి సంబంధించిన విషయాలు ఆరా తీశారు.
సింహయాజికి సంబంధించి ఏపీలోని తిరుపతి ఆశ్రమంలో తనిఖీలు కొనసాగాయి. గత నెల 26న మొయినాబాద్ అజీజ్‌నగర్ ఫామ్‌హౌస్‌లో కుట్ర బయటపడిన రోజు.. సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చేందుకు విమానటికెట్‌ను బుక్ చేసింది ఓ ప్రజాప్రతినిధి బంధువుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో అందుకు సంబంధించిన ఆధారాల సేకరణపై, సిట్ దృష్టి సారించింది.
సింహయాజిని ప్రముఖ స్వామీజీగా పేర్కొంటూ పలువురు రాజకీయ ప్రముఖులకు నందకుమార్ పరిచ యం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సింహయాజివద్ద ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుందని ప్రచారం చేసినట్లు భావిస్తున్న నేపథ్యంలో, రాజకీయనేతలతో సింహయాజికి ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. నందకుమార్‌కి సంబంధించి మూడు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.