Begin typing your search above and press return to search.
అయ్యప్ప ఆగ్రహంతోనే కేరళకు వరదలు?
By: Tupaki Desk | 19 Aug 2018 5:21 AM GMTపిచ్చ పీక్స్ కు వెళ్లటం అంటే ఇదేనేమో. గడిచిన రెండు వారాలుగా కేరళను అతలాకుతలం చేస్తూ విరుచుకుపడిన భారీ వర్షాలతో ఆ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. సూరీడన్న మాటే లేకుండా ఆకాశానికి చిల్లులు పడినట్లుగా కురుస్తున్న వానతో కేరళ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది.
అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న డిజిటల్ యుగంలో ప్రకృతి విపత్తు కారణంగా.. అందునా భారీ వర్షాల కారణంగా భారీ ప్రాణనష్టం జరగటం అందరిని కలిచివేస్తోంది. ప్రకృతి విలయతాండవంతో వణికిపోతున్న కేరళీయులకు దన్నుగా నిలిచేందుకు యావత్ దేశం ఒకటి కావాల్సిన వేళ.. పిచ్చ వాదనలతో విషయాన్ని మరో వైపుకు తీసుకెళుతున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతి ఇష్యూను తమకు అనుకూలంగా.. తమ వాదనలతో కన్వీన్స్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. తాజాగా అలాంటి అతి తెలివినే ప్రదర్శించారు కొందరు నెటిజన్లు. వరదలతో కేరళ మునిగిపోవటానికి కారణం శబరిమల వ్యవహారమే అన్న మాట ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశంపై సుప్రీం జోక్యం కూడా కారణంగా కొందరు అతిగాళ్లు చేస్తున్న ప్రచారం ఇప్పుడు వైరల్ గా మారింది.
అయితే.. ఈ తరహా ట్వీట్లపై కొందరు తీవ్రంగా తప్పు పడుతుంటే.. మరికొందరు కొత్త తరహా వాదనను వైరల్ చేయటానికి తెగ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. షాకింగ్ అంశం ఏమంటే.. కేరళ వరదలకు.. శబరిమలలో మహిళల ప్రవేశానికి ముడిపెట్టి ట్వీట్ చేసిన వారిలో ఆర్ బీఐ బోర్డు సభ్యుడితో పాటు.. ఆర్ ఎస్ ఎస్ ప్రముఖుడు కూడా ఉండటంతో ఈ ట్వీట్ మరింత వైరల్ కావటానికి కారణంగా చెప్పొచ్చు. కష్టంలో ఉన్న కేరళీయులకు ఏదైనా సాయం చేయాల్సిన పరిస్థితుల్లో.. వరదలకు కారణంగా కనిపించని దేవుడి ఆగ్రహంగా ప్రచారం చేయటం తగదన్న సూచనను పలువురు చేస్తున్నారు. ఈ తరహా ప్రచారం మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుందన్నది మర్చిపోకూడదు.