Begin typing your search above and press return to search.

కేరళ వరదలు..కార్లతో 1000 కోట్లు లాస్

By:  Tupaki Desk   |   28 Aug 2018 7:55 AM GMT
కేరళ వరదలు..కార్లతో 1000 కోట్లు లాస్
X
కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఈ వందేళ్లలో అతిపెద్ద నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటి వరకూ అందరూ ఎంతమంది చనిపోయారని మాత్రమే అడుగుతున్నారు. కానీ అంతకుమించిన నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో చాలా మంది వ్యక్తిగత కార్లు మునిగిపోయి ఎందుకు పనికిరాకుండా పోయాయి. కేరళ వ్యాప్తంగా మొత్తం 17500 కార్లు దెబ్బతిన్నాయని తాజాగా తేల్చారు. వీటి నష్టం విలువ 1000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేరళ వ్యాప్తంగా ఉన్న 350 పైచిలుకు కార్ల షోరూంలలోని కొత్త కార్లన్నీ నీట మునిగాయని.. తమను ఆదుకోవాలని డీలర్లు కార్ల కంపెనీలను కోరుతున్నారు.

కేరళ ఆటోమొబైల్ రంగంలో 700 మంది ఆటో బ్రాండ్ డీలర్లున్నారు. వీరందరి చేతిల్లో ట్రక్కులు - స్కూటర్లు - మోటార్ సైకిళ్లు - కార్లు - ట్రాక్టర్ మరియు బస్సుల షోరూంలున్నాయి. గిరాకీ ఉండడంతో పెద్ద ఎత్తున వాహనాలను కొని నిల్వ చేశారు. ఓనం పండుగకు పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటించి అమ్ముదామని చూశారు. కానీ అవన్నీ కూడా వరదలో మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడీ మునిగిపోయిన కార్లన్నీ అమ్మడానికి వీలులేకుండా పోయింది. వాటిని తక్కువ ధరకు అమ్మడమో.. లేక స్క్రాప్ కింద తీసేయడమో తప్పితే మరో దారి లేకుండా ఉంది. దీంతో కేరళ ఆటో పరిశ్రమకు వేల కోట్ల నష్టం వాటిల్లిందని మార్కెట్ వర్గాలంటున్నాయి. ఈ నష్టాన్ని డీలర్లు భరిస్తాయా.? కంపెనీలు భరిస్తాయా అన్నది తేలాల్సి ఉంది. డీలర్లను ఆదుకోవడానికి కంపెనీలు ముందుకు రావాలని డీలర్లు కోరుతున్నారు.

ఇక కేరళలో వరదల్లో మునిగిన వ్యక్తిగత కార్లకు ఇన్సూరెన్స్ ఉండడంతో క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇలా వందల క్లెయిమ్ లు రావడంతో సదురు ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఇంత పెద్ద నష్టానికి ఎలా చెల్లించాలనే దానిపై మథనపడుతున్నాయట.. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలా అని ఆలోచిస్తున్నారట.. కేరళ వరదలు మిగిల్చిన గాయం.. ఇలా అన్ని వర్గాలను, ముఖ్యం గా పరిశ్రమను కోలుకోకుండా దెబ్బతీసింది.