Begin typing your search above and press return to search.
కేరళకు సాయం చేయాలనుకుంటున్నారా?
By: Tupaki Desk | 20 Aug 2018 5:04 AM GMTగాడ్స్ ప్యారడైజ్ గా కీర్తించే కేరళ ఇప్పుడు ప్రకృతి కత్తికి బలైంది. ఊహించని విధంగా విరుచుకుపడిన విలయంతో వణికిపోతోంది. లక్షలాది మంది బాధితులుగా మారిన ఈ విపత్తు కారణంగా కేరళకు జరిగిన ఆస్తి నష్టం దాదాపు రూ.2లక్షల కోట్లకు పైనే ఉంటుందన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఇంత భారీగా నష్టం జరిగినా.. దేశ ప్రధాని మాత్రం రూ.100 కోట్ల తక్షణ సాయాన్ని మాత్రమే ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. కేరళ కష్టానికి పలువురు స్పందిస్తున్నారు. తమకు తోచిన సాయాన్ని ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని పలువురు కేరళకు సాయం అంటూ..రకరకాల మార్గాల్లో మోసం చేయటం షురూ చేశారు. కేరళకు సాయం చేసేందుకు వస్తువుల సేకరణ.. వస్త్రాల సేకరణ.. నిధుల సేకరణ పేరుతో చాలానే చేస్తున్నారు.
అయితే.. ఇలాంటి వాటిని అస్సలు నమ్మొద్దని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీని సారాంశం ఏమంటే.. భారీ వర్షాల కారణంగా కేరళ దారుణంగా దెబ్బ తిన్నది నిజమే అయినా.. తమకు సాయం చేయాలనుకునే వారు ఆర్థిక సాయం కూడా వద్దని పేర్కొనటం గమనార్హం.
నిజానికి తమకు తక్షణం కావాల్సింది ఎలక్ట్రిషియన్స్.. ప్లంబర్లు.. తాపీ పని చేసే వారు.. డ్రైనేజీ నిపుణులు.. కార్మికులు అవసరమని చెబుతున్నారు. కేరళలో 90 శాతం వరకూ సంపన్నులే. 10 శాతం మందే పేదలు. ప్రకృతి పంజా కారణంగా నష్టపోయిన వారు ఏదోలా సర్దుకుంటారని.. కేరళలో వృత్తి నిపుణుల కొరత భారీగా ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మరింత తీవ్రమవుతుందని సదరు ఆడియో క్లిప్ లోని వ్యక్తి చెబుతున్నారు.
బాగా తెలిసిన సంస్థలు.. నమ్మకస్తులైన వారి ద్వారానే సాయాన్ని పంపాలే కానీ.. ఎవరు పడితే వారికి సాయం చేయొద్దన్న విన్నపం ఆ ఆడియో క్లిప్ లో ఉంది. తమకు వస్త్రాలు.. ఆహారం.. అగ్గిపెట్టెలు లాంటి వాటి అవసరం లేదని.. తిరువనంతపురం శివార్లలో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయనట్లుగా ఆ ఆడియో క్లిప్ లో పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులు.. కార్పెంటర్లు.. పెయింటర్లు.. ఫ్లంబర్లు.. ఎలక్ట్రిషియన్లు లాంటి వారి కొరత ఎక్కువగా ఉందని.. వారిని పెద్ద ఎత్తున రాష్ట్రాలు కేరళకు పంపితే తమకు లబ్థి చేకూరుతుందని వెల్లడించారు.
ఇక.. కేరళకు సాయం చేయాలని భావించే వారు ఏ సంస్థ పడితే ఆ సంస్థ ద్వారా సాయాన్ని ఇవ్వొద్దన్న సూచనను పలువురు సూచిస్తున్నారు. ఇదంతా ఏమీ లేకుండా.. మీరు చేయాలనుకున్న సాయాన్ని కేరళ ప్రభుత్వానికే నేరుగా పంపితే సరిపోతుంది. ఇంతకీ.. కేరళ ప్రభుత్వానికి సాయం ఎలా చేయాలంటారా?. ఆ సమాచారాన్ని మేం ఇస్తా. మీకు తోచిన సాయాన్ని కేరళ ప్రభుత్వానికి నేరుగా పంపాల్సిన వివరాలివే..
అకౌంట్ నంబరు: 67319948232
బ్యాంక్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్రాంచ్: సిటీ బ్రాంచ్, తిరువనంతపురం
ఐఎఫ్ఎస్‌సీ కోడ్: ఎస్‌బీఐఎన్0070028
పాన్: ఏఏఏజీడీ0584ఎం