Begin typing your search above and press return to search.

చేపలమ్మిన యువతి లక్షన్నర సాయం..

By:  Tupaki Desk   |   21 Aug 2018 11:10 AM GMT
చేపలమ్మిన యువతి లక్షన్నర సాయం..
X
కేరళకు చెందిన హనన్ చేపలు అమ్ముతూ ఒంటరిగా జీవిస్తూ తన కాళ్లమీద తను నిలబడుతోంది.. ఆమెపై కేరళ మీడియాలో అప్పట్లో ప్రముఖంగా కథనాలు రావడంతో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యింది. ఎంతోమంది ఈ అసహాయ ధీశాలి మహిళ జీవనయానాన్ని మెచ్చుకున్నారు. కానీ కొంతమంది మతచాంధసవాదులు ఈమె చేస్తున్న పనులపై విమర్శలు చేశారు. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. దీనికి ఆమె ఎంతో బాధపడుతూ తనను వదిలేయండని ఇటీవల సోషల్ మీడియాలో వేడుకుంది.

తాజాగా హనన్.. మరో గొప్ప పని చేసి తన మానవత్వాన్ని చాటుకుంది. కేరళ వరద బాధితుల కోసం ఏకంగా తాను కష్టపడి సంపాదించిన దాంట్లోంచి రూ.1.5 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ట్రాన్స్ ఫర్ చేసేసింది.

ఈ సందర్భంగా హనన్ మాట్లాడుతూ.. ఇటీవల కొత్తమంగళం రిలీఫ్ క్యాంపులో బాధితులు ఆహారం , దుస్తులు, నీటి కోసం పడుతున్న ఇబ్బందులను చూసి తట్టుకోలేకపోయానని..అందుకే వారికి సాయం చేయాలని తన అకౌంట్లో ఉన్న డబ్బులను ట్రాన్స్ ఫర్ చేశానని తెలిపింది. ఇలా హనన్ అంత పేదరికంలోనూ లక్షన్నర వరద బాధితులకు ఇవ్వడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.