Begin typing your search above and press return to search.
చెన్నైలోని కేరళ హోటల్ పై దాడి.. కారణమిదే!
By: Tupaki Desk | 3 Jan 2019 9:52 AM GMTకొన్ని విషయాల్లో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ.. కొన్ని ప్రభుత్వాలు.. కొందరు ప్రభుత్వాధినేతలు మొండిగా.. మూర్ఖంగా వ్యవహరిస్తూ సున్నిత అంశాల్ని మరింత పీటముడులు పడేలా చేసి.. ఇష్యూను మరింత పెద్దదిగా చేస్తుంటారు. కేరళ ముఖ్యమంత్రి కమ్ కరుడుగట్టిన కమ్యునిస్ట్ గా చెప్పుకునే విజయన్ ప్రభుత్వం తీసుకుంటున్ననిర్ణయాలపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.
యాభై ఏళ్ల లోపు మహిళల్ని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీం వెలువరించిన తీర్పును అమలు చేసే విషయంపై కేరళ ప్రభుత్వం చేపట్టిన అతిపై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పని కట్టుకొని మరీ.. పోలీసుల పహరాలో ఆలయంలోకి ఇద్దరు మహిళల్ని పంపించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఈ ఉదంతంతో కేరళ రాష్ట్రంలో నిరసనలు మిన్నంటుతున్నాయి.
ఇదిలా ఉంటే.. కేరళ ప్రభుత్వ వ్యవహారశైలిపై వివిధ రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో చోటు చేసుకున్న నిరసన స్థాయి దాటి దాడిగా మారింది. చెన్నైలోని కేరళ ప్రభుత్వ సంస్థ అయిన కేరళ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చెందిన ఒక హోటల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. థౌజండ్ నైట్‌లోని గ్రీమ్స్ రోడ్డులో ఉన్న హోటల్ పై గుర్తు తెలియని వ్యక్తం బుధవారం రాత్రి బాగా పొద్దు పోయాక రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో హోటల్ అద్దాలతో పాటు.. సెక్యురిటీ పోస్టు దెబ్బ తిన్నాయి.
ఈ ఘటనపై తమిళనాడు పోలీసులు రియాక్ట్ అయ్యారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని.. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మరిక జరగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు చెన్నై అధికారులు స్పష్టం చేస్తున్నారు. తాజా ఉదంతంతో అలెర్ట్ అయిన పోలీసులు కేరళ ప్రభుత్వ ఆస్తులకు గట్టి భద్రత కల్పించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. కేరళలో సాగుతున్న బంద్ ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులపై రాళ్లతో దాడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.