Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో పిజ్జా.. బర్గర్లపై భారీ పన్నుపోటు

By:  Tupaki Desk   |   8 July 2016 12:43 PM GMT
ఆ రాష్ట్రంలో పిజ్జా.. బర్గర్లపై భారీ పన్నుపోటు
X
ఇవాళ రేపటి రోజు పిజ్జ.. బర్గర్ తినని వాళ్లంటూ ఉంటారా? ఓ మోస్తరు టౌన్ నుంచే ఈ ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయిన పరిస్థితి. అయితే.. ఇలాంటి పుడ్ మీద ఊహించని పన్ను పోటు వేసిన కేరళ సర్కారు.. ఆ రాష్ట్ర ప్రజలకు భారీగానే షాకిచ్చింది.దేశంలో మరెక్కడా లేని విధంగా.. కేరళ రాష్ట్రంలో ఫ్యాట్ ఫుడ్ కి కేరాఫ్ అడ్రస్ అయిన పిజ్జా.. బర్గర్ తదితర ప్రాశ్చాత్య ఆహార పదార్థాల మీద భారీగా పన్ను పోటు వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

కొవ్వును పెంచే జంక్ ఫుడ్స్ మీద ఫ్యాట్ ట్యాక్స్ విధిస్తున్నట్లుగా కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ ప్రకటించారు. కేరళ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సందర్భంగా మాట్లాడిన ఆర్థిక మంత్రి ఈ సరికొత్త పన్నును ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఫ్యాట్ ట్యాక్స్ కింద పిజ్జా బర్గర్లకు విధించిన పన్ను ఎంతో తెలుసా? ఏకంగా.. 14.5 శాతం. అంటే.. వంద రూపాయిలకు తింటే రూ.14.50 చెల్లించాలన్న మాట.

అంతేకాదు.. ప్యాకేజ్డ్ ఫుడ్ మీద కూడా 5 శాతం అదనపు పన్నును విధిస్తున్నట్లు ప్రకటించారు. కేరళ సర్కారు విధించిన ఫ్యాట్ ట్యాక్స్ కాన్సెప్ట్ డెన్మార్క్.. హంగేరి లాంటి దేశాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఈ దేశాల్లో జంక్ ఫుడ్ మీద భారీగా ఫ్యాట్ ట్యాక్స్ ను విధించే విధానం ఉంది. దాన్నే కేరళలో తాజాగా ప్రకటించారు. కేరళను స్ఫూర్తిగా తీసుకొని ఫ్యాట్ ట్యాక్స్ వేయాలన్నఆలోచన రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్లకు రాకూడదని కోరుకుందాం.