Begin typing your search above and press return to search.
వాటర్ బాటిల్ రేట్ ను ఫిక్స్ చేసిన కేరళ ప్రభుత్వం - కంపెనీలకు షాక్!
By: Tupaki Desk | 13 Feb 2020 5:30 PM GMTప్యూరిఫైడ్ వాటర్ - మినరల్స్ యాడెడ్ వాటర్ అంటూ బాటిల్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ను ఇష్టానుసారం ధరలకు అమ్ముతూ వచ్చిన కంపెనీలకు కేరళ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. లీటర్ వాటర్ బాటిల్ ధరలను కేరళ ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లీటర్ వాటర్ ను 13 రూపాయలకు అమ్మాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్రాండెడ్ మినరల్ వాటర్ ధర కూడా అదే స్థాయిలో ఉండాలని ఆదేశించింది.
ప్రస్తుతం ఏపీ తదితర ప్రాంతాల్లో లీటర్ వాటర్ బాటిల్ ధర కనీసం 20 రూపాయల వరకూ ఉన్న సంగతి తెలిసిందే. ఓ మోస్తరు బ్రాండెట్ మినరల్ వాటర్ బాటిళ్లను ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు. ఆ పై ఆ బ్రాండ్లకు డూప్లికేట్లను తయారు చేస్తూ.. వాటినీ 20 రూపాయలకే మోసపూరితంగా అమ్ముతున్నారు. ఇక మరి కొన్ని బ్రాండ్లు కూడా వెలిశాయి.
వివిధ హోటళ్లు - రెస్టారెంట్లలో వాటి బ్రాండింగ్ వాటర్ బాటిళ్లను అమ్ముతున్నారు. వాటి ధర 25 రూపాయలకు కూడా సేల్ చేస్తున్నారు. ఇలా యావరేజ్ బ్రాండెడ్ మినరల్ వాటర్ నే లీటర్ కు ఈ రేట్లకు అమ్మతున్నారు. ఇన్ని రోజులూ కేరళలో కూడా ఇదే ధరలకే నీళ్లను అమ్ముతుండవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కంపెనీలకు ఝలక్ ఇచ్చింది. ఆ ధరలకు మంచినీళ్లను అమ్మడానికి వీల్లేదని - రేటు తగ్గిస్తూ ఫిక్స్ చేసింది. తాము నిర్దేశించిన ధరకు మించి నీళ్లను అమ్మడానికి వీల్లేదని కూడా కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.