Begin typing your search above and press return to search.

కేరళలో తొలిరోజు 30మందికి మద్యం పంపిణీ

By:  Tupaki Desk   |   1 April 2020 8:10 AM GMT
కేరళలో తొలిరోజు 30మందికి మద్యం పంపిణీ
X
మద్యం రోజూ తాగి ఈ లాక్ డౌన్ వేళ తాగకపోయేసరికి కొందరు పిచ్చివాళ్లుగా మారుతున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణ, ఏపీనే కాదు.. కేరళలోనూ మద్యం బాధితుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. కేరళలో మద్యం దొరక్క ఏకంగా 9మంది మృతిచెందారు. మరో ఆరుగురు మందుబాబులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికే మద్యం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించారు.

మద్యానికి బానిసైన వారిని డి-అడిక్షన్ సెంటర్లకు పంపాలని సూచించారు. ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు పరిశీలిస్తున్నారు.తాజాగా బుధవారం నుంచి కేరళలో మద్యం బానిసలకు మద్యం పంపిణీ ప్రారంభమైంది.

కేరళ ఎక్సైజ్ శాఖ ఏప్రిల్ 1 నుంచి మద్యం బానిసలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మద్యం సరఫరా చేస్తోంది. తొలిరోజు 30మంది అప్లికేషన్లు పెట్టుకోగా డాక్టర్లు వారికి సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో ఆ 30 మందికి మద్యం షాపుల్లో మద్యం ఇస్తారు. ఇక మరికొన్ని అప్లికేషన్లను తిరస్కరించారు.

అయితే మద్యం బానిసలతో కొంతమంది కుమ్మక్కై ఎక్కువగా మద్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది.వారితో ఇష్టానుసారంగా మద్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇక దొరికిన అవకాశంగా మద్యం బానిసల పేరిట తెరిచిన షాపుల ద్వారా మద్యం వ్యాపారులు భారీగా మద్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్టు తెలిసింది. మరికొందరు డాక్టర్లతో మిలాఖత్ అయ్యి ఫేక్ మద్యం బానిసలుగా సర్టిఫికెట్ పొందుతున్నట్టు తెలిసింది.