Begin typing your search above and press return to search.
లెస్బియన్స్ ఇద్దరు సహజీవనం చేయడానికి కేరళ హైకోర్టు అనుమతి
By: Tupaki Desk | 11 Jun 2022 8:58 AM GMTఇద్దరు లెస్బియన్స్ అయిన అమ్మాయిలు కలిసి ఉండటానికి కేరళ హైకోర్టు తాజాగా అనుమతిచ్చింది. తాము కలసి సహజీవనం చేయడానికి అనుమతించాలంటూ కోజికోడ్ కు చెందిన ఆదిలా నస్రిన్ అనే అమ్మాయి కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అలాగే తన ప్రియురాలు అయిన ఫాతిమా నూరాను ఆమె కుటుంబ సభ్యులు కనిపించకుండా చేశారని పిటిషన్ దాఖలు చేసింది.
తన లెస్బియన్ భాగస్వామిని ఆమె పెద్దలు కిడ్నాప్ చేశారని.. ఆమెను తన దగ్గరకు చేర్చడంతోపాటు తాము కలసి జీవించడానికి అనుమతించాలని హైకోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్ నేపథ్యంలో కోజికోడ్‌కు చెందిన కిడ్నాపైన యువతిని కోర్టులో హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది.
కాగా, కేరళలోని అలువా ప్రాంతంలో నివసించే ఆదిలా నస్రిన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయకముందు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో జీవించడం కోసం ఇంటి నుంచి వచ్చేసిన తన భాగస్వామిని ఆమె కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసి నిర్బంధించారని లెస్బియన్ అయిన ఆదిలా తన ఫిర్యాదులో పేర్కొంది. ఆదిలా నస్రిన్ సౌదీ అరేబియాలో ఓ పాఠశాలలో చదువుతున్న సమయంలో తామరస్సేరీకి చెందిన 23 ఏళ్ల యువతి నూరాతో ప్రేమలో పడింది. వీరి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అది అసహజమని వారు వ్యతిరేకించారు.
దీంతో ఆదిలా, నూరా ఇద్దరు కేరళకు వచ్చిన తర్వాత ప్రేమలో పడ్డారు. తర్వాత కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఇద్దరూ కోజికోడ్‌లో ఇల్లు తీసుకుని సహజీవం చేయడం ప్రారంభించారు. అయితే నూరా బంధువులు లెస్బియన్సు ఉంటున్న ఇంటికి వచ్చి గొడవ చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అనంతరం ఆదిలా తల్లిదండ్రులు ఇద్దరినీ ఆలువాలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు.
ఈ క్రమంలో ఓ రోజు నూరా బంధువులు తామరస్సేరి నుంచి వచ్చి తనను బలవంతంగా తీసుకెళ్లారని ఆదిలా తన పిటిషన్ లో పేర్కొంది. పెద్దవాళ్ళలా కలిసి జీవించే హక్కు ఇద్దరికీ ఉందని.. అందుకు అనుమతించాలని వేడుకుంది. న్యాయ వ్యవస్థ ద్వారా పోలీసులు, కోర్టులు జోక్యం చేసుకోవాలని ఆదిలా కోరింది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా లెస్బియన్సు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నూరా, తాను కలిసి ఉండటానికి అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.
మరోవైపు కేరళ హైకోర్టు తీర్పుపై మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కేరళ హైకోర్టు లెస్బియన్సుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొనియాడాయి. స్వలింగ సంపర్కం తప్పనే అభిప్రాయం సరికాదని అంటున్నాయి. స్వలింగ సంపర్కం అంటే ఒకే లింగానికి చెందిన వ్యక్తి పట్ల లైంగికంగా ఆకర్షితుడు అవ్వడం. ఇందులో కేవలం స్త్రీ పట్ల మాత్రమే లైంగికంగా ఆకర్షితమయ్యే స్త్రీని లెస్బియన్ అనీ, పురుషుడి పట్ల మాత్రమే లైంగికంగా ఆకర్షితుడైన పురుషుడిని గే అనీ అంటారు.