Begin typing your search above and press return to search.

కేరళ హైకోర్టు మరో సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   22 Sep 2021 1:30 PM GMT
కేరళ హైకోర్టు మరో సంచలన తీర్పు
X
కేరళ హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది. అత్యాచార బాధితురాలికి ఉపశమనం కలిగించే తీర్పును వెలువరించి గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆమె అత్యాచారానికి గురై గర్భం రాగా.. ఆ ప్రెగ్నెన్సీ తొలగింపునకు కోర్టు అనుమతి ఇవ్వడం విశేషం. ఈ వారంలో కేరళ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుల్లో ఇది కూడా ఒకటి.

సెప్టెంబర్ 14న కూడా రెండు కేసుల్లో బాధితులు 26 వారాల కంటే ఎక్కువ గర్భవతిగా ఉన్నారు. మెడికల్ బోర్డు సిఫారసు ఆధారంగా గర్భస్రావం అనుమతించబడింది.

తాజాగా కేసులో బాధితురాలు 16 ఏళ్ల బాలిక. అంతేకాదు.. 8 వారాల గర్భవతి కూడా. గర్భస్రావం చేయించుకునేందుకు ఆమె సంప్రదించిన ప్రైవేటు ఆస్పత్రి ఒక నేరం జరిగినందున ఈ ప్రక్రియ నిర్వహించడానికి నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

భారత్ లో గర్భస్రావం కొన్ని సందర్భాల్లో చట్టబద్దమైనదిగా పరిగణిస్తారు. వైద్యపరంగా తప్పని పరిస్థితుల్లో పిండాన్ని తొలగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే అబార్షన్ ను చట్టపరంగా అనుమతిస్తారున.అబార్షన్ చేయించుకునే వారి వయసు 18 ఏళ్లు కంటే తక్కువ ఉన్నప్పుడు.. మతిస్తిమితం లేనప్పుడు.. అత్యాచారాలు జరిగినప్పుడు మహిళ సమ్మతితో అబార్షన్ కు అనుమతిస్తారు. కేరళ కోర్టు తీసుకున్న ఈ తీర్పు ఇప్పుడు బాధితులకు పెద్ద ఉపశమనంగా చెబుతున్నారు. హైకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు.