Begin typing your search above and press return to search.
భార్యకు ఇష్టం లేని శృంగారం అత్యాచారమే.. తేల్చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు
By: Tupaki Desk | 7 Aug 2021 3:54 AM GMTఈ మధ్యనే విడుదలైన ‘వకీల్ సాబ్’ మూవీలో హీరోగా నటించిన పవన్ కల్యాణ్ పాత్ర వాదనలు వినిపిస్తూ.. ఎవరైనా సరే.. చివరకు భర్తతో శృంగారం చేయటానికి నో చెబితే నోనే. చేయటానికి వీల్లేదన్న అర్థం వచ్చే డైలాగ్ ఉంటుంది. తాజాగా కేరళ హైకోర్టు కూడా ఇదే తరహాలో చేసిన వ్యాఖ్య ఇప్పుడు కీలకంగా మారింది. భార్యభర్తల బంధంలో అత్యంత వ్యక్తిగమైన శృంగారంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్యకు ఇష్టం లేని శృంగారాన్ని భర్త చేస్తే అది అత్యాచారమే అవుతుందని స్పష్టం చేసింది.
‘భార్య దేహాన్ని భర్త పూర్తిగా తన ఆస్తిగా భావించకూడదు. వివాహం.. విడాకులు అనేవి లౌకిక చట్ట పరిధిలో ఉండాలి. మన దేశంలో వివాహ చట్టాన్ని పునరావలోకనం చేసుకోవాల్సిన సమయం వచ్చింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తమకు విడాకులు మంజూరు చేయటాన్ని సవాలు చేస్తూ.. ఒక భర్త దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వ్యాఖ్యలు గత నెల 30న జస్టిస్ ఎ ముహమ్మద్ ముస్తాక్.. జస్టిస్ కౌసర్ ఎడప్పగథ్ లతో కూడిన ధర్మాసనం చేసింది.
ఆధునిక న్యాయశాస్త్రంలో దంపతులను సమాన హక్కుదారులుగా పరిగణిస్తారు. భారపై భర్తకు అధిపత్య హక్కులేవీ ఉండవన్న ధర్మానసం.. తాము విచారిస్తున్న కేసులో డబ్బు.. శృంగారంపై భర్తకు ఉన్న అత్యాశతోనే భార్య విడాకుల కోసం ఆశ్రయించిందన్న అభిప్రాయాన్ని న్యాయస్థానం వెల్లడించింది. అందుకే ఆమె కోరిన రీతిలో విడాకులు ఇవ్వటాన్ని సమర్థిస్తూ.. భర్త అభ్యంతరాన్ని కొట్టి పారేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా మరిన్ని కీలక వ్యాఖ్యల్ని చేసింది ధర్మాసనం.
వైవాహిక అత్యాచారాన్ని శిక్షార్హంగా చట్టంలో గుర్తించలేదు. అయితే.. విడాకులు మంజూరు చేయదగ్గ క్రూరత్వంగా దాన్ని పరిగణించటంలో కోర్టుకు అదేమీ అడ్డు కాబోదని పేర్కొంది. వైవాహిక అత్యాచారం ఆధారంగా విడాకులు కోరటం సబబేనని తాము అభిప్రాయపడుతున్నట్లుగా స్పష్టం చేసింది. ‘భార్య శరీరంపై తనకు పూర్తి హక్కులు ఉన్నట్లు భర్త భావించటం.. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక చర్యల్లో పాల్గొనటం వైవాహిక అత్యాచారం కిందకు లెక్కే’ అని పేర్కొంది. సో.. మగమహారాజులు ఇప్పటివరకున్న మైండ్ సెట్ మార్చుకోవాల్సిన టైమొచ్చింది. లేదంటే.. కొత్త చిక్కులు తప్పవు. అర్థమవుతుందా?