Begin typing your search above and press return to search.
ఆ క్రికెటర్ కథ అలా ముగిసింది!
By: Tupaki Desk | 18 Oct 2017 10:37 AM GMTఐపీఎల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్!! క్రికెట్ కు ఉన్న క్రేజ్ ను మరింత క్యాష్ చేసుకునేందుకు మొదలుపెట్టిన లీగ్!! ఇది ఎంతోమంది యువ క్రికెటర్ల జీవితాలను మార్చేసింది! ఎక్కడో మారుమూల గల్లీల్లో ఉండే క్రీడాకారులను స్టార్ లుగా మార్చేసింది! వాళ్లకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచి.. క్రీడాకారుల కలలు నెరవేరుస్తోంది! నాణేనికి ఇది ఒకవైపు మాత్రమే! మరోవైపు దీనివల్ల జీవితాలు నాశనం చేసుకున్న వారు కూడా లేకపోలేదు! అంతర్జాతీయ క్రికెట్ లోనే ఉండే బెట్టింగ్ భూతం.. దీనిలోనూ ప్రవేశించి.. ఆటగాళ్ల బంగారు భవిష్యత్ ను చిత్తుచేసింది. ఇలాంటి వారిలో కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్ ఒకరు. అతడిపై నిషేధం ఎత్తివేస్తారని భావించిన అందరికీ షాక్ తగిలింది!!
దేశం తరఫున ఆడాలనేది ప్రతి ఒక్క ఆటగాడి కల! దానికోసం అహర్నిశలు శ్రమిస్తారు! ఒక్కసారి అందులో చోటు దక్కిన తర్వాత జట్టులో స్థానం కోసం కష్టపడతారు. ఇలా ఎంతోమంది కలలు కన్న వారిలో శ్రీశాంత్ కూడా ఒకరు. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాడే అయినా.. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడంలో మాత్రం వెనకడుగే! అందుకే వివాదాల్లో చాలా తొందరగా చిక్కుకున్నాడు. తర్వాత వాటి నుంచి బయపడేందుకు ప్రయత్నించినా.. చివరకు ఐపీఎల్ పుణ్యమా అని కెరీర్ ప్రమాదంలో పడిపోయింది. ఐపీఎల్ ఆరో సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం - ఆ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్ అరెస్టవడం - జీవిత కాల నిషేధానికి గురికావడం తెల్సిన విషయాలే.
'నన్ను అమాయకుడ్ని చేసి - నాపై బురద జల్లారు.. నా జీవితాన్ని నాశనం చేశారు..' అంటూ వాపోయాడు శ్రీశాంత్. కానీ, ఉపయోగం లేకుండా పోయింది. క్రికెట్ కి దూరమవడం ఇష్టం లేకనే - దూరమయ్యాడు. సినిమాకి దగ్గరయ్యాడు. రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. ఎక్కడా కాలం కలిసిరాలేదు. ఈ టైమ్ లో చిన్న ఊరట. నిషేధం ఎత్తివేస్తూ - కేరళ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని బీసీసీఐ సవాల్ చేస్తే - తాజాగా షాక్ తగిలింది. జీవితకాల నిషేధాన్ని న్యాయస్థానం సమర్థించింది. అంతే, ఇక ఇప్పుడు చేయడానికేమీ లేదు.. ఒక్క సుప్రీంకోర్టుని ఆశ్రయించడం తప్ప ఇక సుప్రీం కోర్టుకి వెళ్లినా ఊరట లభిస్తుందన్న గ్యారంటీ కూడాలేదు!