Begin typing your search above and press return to search.

భార్యను మరో అమ్మాయితో పోల్చాడని పెళ్లి రద్దు చేసిన కోర్టు

By:  Tupaki Desk   |   18 Aug 2022 1:30 PM GMT
భార్యను మరో అమ్మాయితో పోల్చాడని పెళ్లి రద్దు చేసిన కోర్టు
X
భార్యను ఇతర మహిళలతో పోల్చడం.. అందంగా లేవని సూటిపోటి మాటలతో వేధించడం క్రూరత్వమేనని.. విడాకుల మంజూరుకు దీనిని పరిగణలోకి తీసుకోవచ్చని కేరళ హైకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. అందం విషయంలో అంచనాలు తలకిందులయ్యాయని.. అనుకున్నంత అందంగా లేవని తనను రోజూ మాటలతో దెప్పిపొడుస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించింది.

ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. తనకు విడాకులు మంజూరు చేయాలన్న ఆమె వాదనలను సమర్థించింది.

భార్యను అందంగా లేవని.. ఇతర స్త్రీలతో పోల్చి వెక్కించినందుకు విడాకులు మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువురించింది. తన భర్త క్రూరంగా వ్యవహరిస్తున్నాడని.. సూటిపోటి మాటలతో మానసిక వేధనకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ ఓ మహిళ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆమె వాదనలు సమర్థించిన ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.

ఈ తీర్పును సదురు భర్త కేరళ హైకోర్టులో సవాల్ చేయగా.. జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ సీఎస్ సుధ ధర్మాసనం విచారణ చేపట్టింది. భర్త పదే పదే తిట్టడం.. ఇతర మహిళలతో పోల్చడం మొదలైనవి ఖచ్చితంగా మానసిక క్రూరత్వం కిందకు వస్తాయని.. దానిని భార్య భరించలేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అందంగా లేనని.. సోదరుడి భార్యతో సహా మరికొందరితో పోల్చుతూ తిడుతున్నాడని భార్య ఆరోపించింది. విడాకులకు ఇది సరైన కారణం కాకపోయినప్పటికీ వారి వైవాహిక జీవితం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైందని కోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో పార్టీలు, సమాజం అభిరుచులను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది.

వివాహ బంధాన్ని సాధ్యమైనంత వరకూ కొనసాగించాలని ప్రజాప్రయోజనాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ భాగస్వామి ఆశలు పునరుద్దరించలేని విధంగా దెబ్బతింటే వాస్తవాన్ని గుర్తించాలని పేర్కొంటూ విడాకులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది