Begin typing your search above and press return to search.
మహిళల రొమ్ములు కోసి.. 56 ముక్కలు చేసి.. వాటిని భక్షించిన దంపతులు!
By: Tupaki Desk | 13 Oct 2022 1:30 PM GMTనరబలి ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి భారీ ఎత్తున సంపద చేకూరుతుందని కేరళలో దంపతులు.. ఇద్దరు మహిళలను బలి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. కాగా ఇందుకు కారణమైన భార్యాభర్తలతోపాటు మంత్రగాడిని కూడా కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళల నరబలికి సంబంధించి పోలీసులు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు.
కేరళలోని పథనంతిట్ట జిల్లా ఎలంతూర్‌లో భగవల్ సింగ్, లైలా దంపతులు ఉన్నారు. నరబలి ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద చేకూరుతుందని వారికి మాంత్రికుడు రషీద్ అలియాస్ మహ్మద్ షపీ చెప్పాడు.
అంతేకాకుండా తనకు పరిచయమున్న వీధుల్లో లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవనం సాగించే పద్మ (52)ను, రోస్లిన్(50)ను రషీద్ ఎలంతూర్‌లో భగవల్ సింగ్ దంపతుల నివాసానికి తీసుకువచ్చాడు. ఈ మహిళలిద్దరూ రషీద్‌కు ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా పరిచయమయ్యారు. గతంలో 75 మహిళపై అత్యాచారం చేసి రషీద్ జైలుకెళ్లాడు. ప్రస్తుతం ఆ కేసులో బెయిల్ పై ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన శృంగార వాంఛను తీర్చుకోవడానికి తనతో శృంగారంలో పాల్గొంటే రూ.15 వేలు ఇస్తానని, నీలి చిత్రాల్లో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తానని పద్మ, రోస్లిన్‌లను బుట్టలో వేసుకున్నాడు.
వీరిని ఎలంతూరులోని భగవల్ సింగ్ నివాసానికి తీసుకొచ్చిన రషీద్ దంపతులతో కలిసి వారిని నరబలి ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మహిళల రొమ్ములను సైతం కత్తిరించాడు. రక్తం ప్రవహిస్తే మంచి జరుగుతుందని ఇలా రొమ్ములు కోశాడు. ఆ తర్వాత పద్మను ఐదు ముక్కలుగా, రోస్లిన్‌ను 56 ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత భగవల్ సింగ్, అతడి భార్య, మాంత్రికుడు రషీద్ మృతుల శరీర భాగాలను వండుకుని భుజించారు.
కాగా పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మరికొంత మందిని కూడా నరబలి ఇవ్వాలని నిందితులు నిర్ణయించుకున్నట్టు తేలింది. నరబలి కోసం ఇప్పటికే తిరువళ్లకు చెందిన ఓ మహిళను షఫీ తీసుకొచ్చాడు. అయితే ఆమె తాను ఎక్కడుందన్న వివరాల్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో ఆమెను చంపితే దొరికిపోవడం ఖాయమని భయపడిన నిందితులు.. నరబలి ఆలోచనను వదిలిపెట్టారు. అలానే ఓ చిన్నారితో కూడిన కుటుంబాన్ని కూడా నరబలి కోసం షఫీ.. భగవల్, లైలా ఇంటికి తీసుకొచ్చాడని సమాచారం. అయితే వారు ఎవరు, వారిని ఏం చేశారనే విషయం విచారణలో తేలాల్సి ఉందని అంటున్నారు.
కాగా మృతుల్లో పద్మ ఫోన్ నిందితుడు షఫీ దగ్గర ఉండటంతో పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు. అతడిని విచారించగా నరబలి వెలుగుచూసింది. సీసీటీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్ టవర్ లొకేషన్స్ సహాయంతో నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.