Begin typing your search above and press return to search.

ఆ మహమ్మారి.. మళ్లీ వచ్చింది..

By:  Tupaki Desk   |   3 Jun 2019 8:54 AM GMT
ఆ మహమ్మారి.. మళ్లీ వచ్చింది..
X
నిఫా వైరస్.. అంతుచిక్కని ఈ వ్యాధి బారిన పడి కేరళలో మరణ మృదంగం వినిపించింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. గబ్బీలాల ద్వారా మానవులకు వ్యాపించే ఈ నిఫా వైరస్ సోకితే బతికే చాన్స్ 5శాతమే.. ఇంకా ఈ వ్యాధికి మందు కనిపెట్టలేదు.. సుమారు 25మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కోజికోడ్ లో తొలుత ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఆస్పత్రి నర్సులు, వైద్యులు కూడా ఈ వ్యాధి బారిన పడి మరణించారు. కేంద్రంలోని సర్కారు, రాష్ట్ర సర్కారు అలెర్ట్ ప్రకటించి అప్పటివరకు నియంత్రించాయి..

అయితే తాజాగా మరోసారి నిఫా వైరస్ కలకలం మొదలైంది. ఎర్నాకుళంలో ఓ యువకుడికి నిఫా సోకిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని.. అయితే వ్యాధి ఇంకా నిర్ధారణ కాలేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి శైలజ ప్రకటించింది.

ఎర్నాకుళంకు చెందిన 23 ఏళ్ల యువకుడు ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం కోసం మే 21 నుంచి 22 మందితో కలిసి త్రిసూర్ లోని ఓ కంపెనీకి వెళ్లాడు. అప్పటికే జ్వరం బారిన పడ్డాడు. రెండు రోజుల తర్వాత ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయినా జ్వరం తగ్గకపోవడంతో ఎర్నాకుళం తిరిగి వచ్చాడు. తల్లిదండ్రులు ఓ పెద్ద ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వారు నిఫా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. అతడి రక్త నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.

ఇక మరోసారి నిఫా వైరస్ ఉనికి బయటపడడంతో కేరళ సర్కారు అలెర్ట్ అయ్యింది. పలు ఆస్పత్రులలో ఐసోలెటేడ్ వార్డులు ఏర్పాటు చేసింది. లక్షణాలున్న ప్రజలు చెక్ చేసుకోవాలని సూచించింది.