Begin typing your search above and press return to search.

కరోనా: గుజరాత్, కేరళ.. ఎవరి మోడల్ బెటర్?

By:  Tupaki Desk   |   29 Jun 2020 11:30 PM GMT
కరోనా: గుజరాత్, కేరళ.. ఎవరి మోడల్ బెటర్?
X
ప్రధాని నరేంద్రమోడీ ఏలిన ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లో వైద్యం అథమ స్థితిలో ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గుజరాత్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత 29శాతంగా ఉంది. 90శాతం సర్జన్లు, గైనకాలజిస్టులు, శిశువైద్య నిపుణుల పోస్టులను ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఆదర్శ రాష్ట్రంగా చెప్పే గుజరాత్ లో ఆరోగ్య కేంద్రాల పరిస్థితిపై కేంద్రం గణాంకాలను చూస్తే ఇట్టే అర్థమవుతోంది. అందుకే గుజరాత్ లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. మోడీ పాలించినా ఇక్కడ పరిస్థితిలో మార్పు లేకపోవడం గమనార్హం.

ఇక కేరళ ఆదర్శ రాష్ట్రం. కేరళ పంచాయితీ మోడల్ ను అనుసరించారు అక్కడ సర్పంచ్ లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చాలా క్రియాశీలంగా ఉంటాయి. కరోనా వైరస్ ను పూర్తిగా నియంత్రించిన కేరళ మోడల్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేరళలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తారు. కరోనా రోగులను గుర్తించడం.. వారికి సూచనలు ఇవ్వడం.. రోగులను క్వారంటైన్ లో ఉంచడం లాంటి పనులు వారే చూస్తారు. ప్రజలకు మహమ్మారి గురించి ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పిస్తారు.

కేరళలో రాత్రికి రాత్రే ఏమీ జరిగిపోలేదు. వారు ముందే అన్నింటికి సిద్ధంగా ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా చర్యలు తీసుకునే సామర్థ్యం కేరళ వైద్య వ్యవస్థలో ఉంది. నర్సులు, వైద్యులు అక్కడ పూర్తి స్థాయిలో భర్తీ అయ్యి విధుల్లో ఉన్నారు.

దేశంలో మొత్తం డాక్టర్లను పరిశీలిస్తే గుజరాత్ లో రిజిస్టర్ అయిన డాక్టర్లు 5.77శాతం మాత్రమే. దేశంలో 11 లక్షల మంది డాక్టర్లు ఉంటే గుజరాత్ లో కేవలం 66944 మంది మాత్రమే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 14.96మందితో మొదటి స్థానంలో ఉన్నారు. కేరళలో మాత్రం తక్కువ జనాభాకు ఎక్కువ వైద్యులు, నర్సులున్నారు. అక్కడ నిక్చచ్చగా సేవలకే కరోనా కంట్రోల్ అయ్యింది.