Begin typing your search above and press return to search.

‘స్విగ్గీ’తో తినేవాళ్లందరూ వాళ్ల రుచిచూడాల్సిందే..

By:  Tupaki Desk   |   13 July 2019 10:16 AM GMT
‘స్విగ్గీ’తో తినేవాళ్లందరూ వాళ్ల రుచిచూడాల్సిందే..
X
భూలోక స్వర్గంగా పేరుగాంచిన కేరళ అందాలు అన్నీ ఇన్నీ కావు.. మంచి పర్యాటక ప్రదేశాలకు నెలవైన ఈ రాష్ట్రం మంచి ఆహారానికి కూడా ఫేమసే.. ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు కేరళ రుచులు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా సముద్రం ఒడ్డునే ఉండే ఈ రాష్ట్రం చేపలతో చేసి కూరలు హైలెట్ అని చెప్పవచ్చు.

అయితే కేరళ పర్యాటక రంగంలో కేరళలోని త్రిసూర్ జిల్లా వియ్యూర్ సెంట్రల్ జైలు ఖైదీలు కూడా పాలుపంచుకుంటున్నారు. కొద్దిరోజులుగా నలభీమ పాకులుగా వారు వంటకాలు సిద్ధం చేసి బయట మార్కెట్లో అమ్ముతున్నారు. అయితే జైలు ఖైదీలు వండుతున్నారని కొందరు మొహమాటం పడుతున్నారట.. అందుకే తాజాగా జైలు అధికారులు.. ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’తో జతకట్టారు.

కొన్నేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఈ క్యాంటీన్ ను నిర్వహిస్తున్నారు. ఫ్రీడం ఫుడ్ ఫ్యాక్టరీ పేరుతో ఏర్పాటు చేశారు. అటు స్విగ్గీతోపాటు బయట కూడా డెలివరీ చేస్తున్నారు. ఆహారం తయారు చేసి డెలివరీ ప్యాకింగ్ కూడా వీరే చేస్తున్నారు. ఇక చికెన్ బిర్యానీ కాంబో రేటు కేవలం 127మాత్రమే పెట్టారు. వాటర్ బాటిల్ వద్దనుకుంటే 117కే ఇస్తున్నారు.

స్విగ్గీకి ఫుడ్ ఆర్డర్లు ఎక్కువ. ఇక ఖైదీల వంట ధర తక్కువ కావడంతో ఈ డీల్ కుదిరింది. దీంతో వారు ఖైదీలతో వండలు వండిస్తున్నారు. ఖైదీలు వినూత్నంగా చికెన్ బిర్యానీ కాంబో మెనూలో ఒక అరిటాకు, తాగునీరు బాటిల్ కూడా సరఫరా చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. స్విగ్గీలో ఆర్డర్లు పెట్టగానే 20 నిమిషాల్లోనే పార్సిల్ లు ఫుల్ అయ్యి మూసివేశారంటే వీరి డిమాండ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. దీనికి భారీ స్పందన వస్తోంది. మొబైల్ సర్వీసులు ద్వారా కూడా అందజేస్తున్నారు. జైల్లో వీరు సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఇలా త్రిసూర్ లోని జైలు ఖైదీల పాలిట కల్పతరువుగా.. స్పెషాలిటీగా నిలుస్తోంది.