Begin typing your search above and press return to search.
ఫ్రెండ్ ను ఇంట్లో పెట్టుకుంటే భార్యను లేపుకెళ్లాడు!
By: Tupaki Desk | 22 May 2020 11:58 AM GMTఅసలే లాక్ డౌన్.. పెద్ద ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో ఇరుక్కుపోయాడు. పోయే దారి లేదు. దీంతో పాపం అని అతడి స్నేహితుడు చేరదీసి ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ ఈ లాక్ డౌన్ నెలరోజుల్లో స్నేహితుడి భార్యనే లైన్ లో పెట్టి ఆమెను లేపుకెళ్లాడు. ఈ ప్రబుద్ధుడి వ్యవహారం కేరళలో చోటుచేసుకుంది.
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని ఇడుక్కీ మున్నార్ గ్రామంలో లోథారియో(32) అనే వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. లాక్ డౌన్ విధించడంతో మువత్తుపుజ పట్టణంలో ఇరుక్కుపోయాడు. తన సొంతూరుకు వెళ్లలేక అదే పట్టణంలో నివాసం ఉండే తన చిన్ననాటి స్నేహితుడి సాయం కోరాడు. అతడికి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు.
స్నేహితుడిని నమ్మి ఆశ్రయం ఇవ్వడమే కాదు.. అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. ఈ కొంచెం గ్యాప్ లో చక్కగా ఉండాల్సిన స్నేహితుడు ఏకంగా ఫ్రెండ్ భార్యను లైన్ లో పెట్టాడు. ఆమెతో కలిసి ఫ్రెండ్ కారులోనే లేపుకెళ్లాడు. మొత్తం బంగారాన్ని కూడా సదురు భార్య తీసుకెళ్లిపోవడం గమనార్హం.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. ట్రేస్ చేసిన పోలీసులు ఈ జంటను తీసుకొచ్చారు. తాను తన భర్త ఫ్రెండ్ తోనే ఉంటానని ఆమె పోలీసులకు చెప్పింది. దీంతో కేసులు పెట్టి ఇద్దరినీ జైలుకు పంపుతామని.. పిల్లలు గురించి ఆలోచించమని పోలీసులు తెలిపారు.
దీంతో మనసు మార్చుకొని పాత భర్త తోనే ఉంటానని సదురు భార్య ఒప్పుకుంది. భర్త కూడా పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఒకే చెప్పడంతో ఈ కథ సుఖాంతమైంది. నమ్మిన స్నేహితుడు - కట్టుకున్న భార్య చేసిన మోసానికి ఆ భర్త తలెత్తుకోలేకుండా అయ్యాడు.