Begin typing your search above and press return to search.
నటి కిడ్నాప్ కేసు...ఎమ్మెల్యేల విచారణ!
By: Tupaki Desk | 14 July 2017 1:45 PM GMTప్రముఖ మళయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన చాలా మంది మలయాళ సినీ ప్రముఖులను పోలీసులు విచారణ చేశారు. అయితే, తాజాగా రాజకీయ పార్టీల నాయకుల మీద పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో ప్రముఖ నటుడు దిలీప్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే.
అయితే, దిలీప్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రముఖ మలయాళం దర్శకుడు - బహుబాష నటుడు లాల్ - కేరళ శాసన సభ్యుడు పీటీ. థామస్ (కాంగ్రెస్) తో సహా మరో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను విచారణ చేయనున్నట్లు సమాచారం. ఆ ముగ్గరురికి ఈ కేసుతో ఏమన్నా సంబంధం ఉందా అన్న వివరాలు సేకరించడానికి పోలీసులు నిర్ణయించారు.
ఆ ముగ్గురిని పోలీసులు విచారించనున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కేసుతో మాలీవుడ్ కే కాకుండా కొంతమంది రాజకీయ నాయకులకు కూడా సంబంధం ఉన్నట్లు మలయాళ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కేసుతో ఇంకా ఎంత మందికి సంబంధం ఉందో విచారణలో తెలుస్తుందని కేరళ పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు నుంచి పల్సర్ సునీ తప్పించుకోవడానికి రాజకీయ నాయకులు సహకరించారని ఆరోపణలు వచ్చాయి.