Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నం రేపుతున్న న‌టి మృతి

By:  Tupaki Desk   |   14 May 2022 11:30 AM GMT
సంచ‌ల‌నం రేపుతున్న న‌టి మృతి
X
పుట్టిన‌రోజు నాడే న‌టి అనుమానాద‌స్ప‌ద స్థితిలో మృతి చెందిన ఘ‌ట‌న కేర‌ళలో చోటు చేసుకుంది. ఆ రాష్ర్టంలోని కాస‌ర్ గోడ్ కి చెందిన ష‌హానా (20) మోడ‌ల్ గా రాణిస్తుంది. మోడ‌లింగ్ రంగంలో ష‌హానా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు రాష్ర్ట స్థాయిలో సంపాదించారు. ప‌లు వ‌స్ర్తాభ‌ర‌ణ సంస్థ‌ల‌కు మోడ‌ల్ గా చేసారు. దీంతో ష‌హానాకి సినిమాల్లోనూ రాణించాల‌ని ఎన్నో క‌ల‌లు కంది.

ఈక్ర‌మంలోనే రెండేళ‌క్ల క్రితం స‌జ్జ‌ద్ అనే వ్య‌క్తితో వివాహ‌మైంది. దీంతో ఆ జంట కోయ్ కోడ్ స‌మీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే గురువారం రాత్రి కిటీకి ఊచ‌ల‌కు ష‌హానా మృత దేహం వేలాడుతూ క‌నిపించింది. స్థానికులు ఈ విష‌యాన్ని గ్ర‌హించి వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసు అనుమానాదాస్ప‌ద మృతిగా న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

అయితే ష‌హానా త‌ల‌ల్లిదండ్రులు త‌న భ‌ర్తే చంపి ఉంటాడ‌ని ఆరోపిస్తున్నారు. త‌మ కుమార్తె ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికిది కాద‌ని...ఫోన్ చేసిన ప్ర‌తిసారి ఏడుస్తూ మాట్లాడేద‌ని.. భ‌ర్త చిత్ర హింస‌ల‌కు గురి చేస్తున్నాడ‌ని..తాగొచ్చి డ‌బ్బులు కోసం వేధించేవాడ‌ని ప‌లు మార్లు త‌ల్లి వ‌ద్ద మొర పెట్టుకున్న‌ట్లు ఆరోపించారు.

అత్తింటి వాళ్లు చిత్ర హింస‌లే ఇంత దారుణానికి దారి తీసి ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో స‌జ్జద్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు ఘ‌న‌పై స్పందించారు. షహానా తమిళ ప్రాజెక్టులో నటించినందుకు పారితోషికం రావడంతో ఆ డబ్బుల కోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు.

షహానా బర్త్‌డే రోజు కూడా సజ్జద్‌ ఆలస్యంగా వచ్చాడని దాంతో ఇద్దరు మరోసారి తీవ్ర స్థాయిలో గొడవపడ్డారని ప్రాధ‌మిక ద‌ర్యాప్తులో తేలింది. అయితే కేసులో ఇంకా లోతైన విచార‌ణ అవ‌స‌రమ‌ని భావించి ఆ దిశ‌గా పోలీసులు విచార‌ణ సాగిస్తున్నారు.

20 ఏళ్ల చిన్న వయస్సు లోనే ష‌హానా మోడలింగ్‌ రంగంలో తనదైన ముద్ర వేశారు. అందం..అభిన‌యంతోనే ఆమె అవ‌కాశాలు ఒడిసి ప‌ట్టుకున్నారు. ష‌హానా డ్రీమ్ కి చేరువ‌వుతోన్న స‌మ‌యంలోనే మృతి ఒడిలోకి జారుకున్నారు.