Begin typing your search above and press return to search.
చారిత్రక నిర్ణయం తీసుకున్న కేరళ మసీదు పెద్దలు
By: Tupaki Desk | 24 April 2016 9:54 AM GMTదేశంలోని కొన్ని దేవాలయాలు.. ప్రార్థనా మందిరాల్లోకి మహిళలకు ప్రవేశం లేని సంగతి తెలిసిందే. దీన్ని వివక్షగా పేర్కొంటూ.. కొందరు మహిళలు ఆయా దేవాలయాల్లోకి.. ప్రార్థనా మందిరాల్లోకి ప్రవేశించి పూజలు చేసేందుకు ప్రయత్నించటం.. ఇదో వివాదంగా మారటం ఈ మధ్యన ఎక్కువైంది. మహిళా గ్రూపులు కొన్ని దేవాలయాల్లోకి ప్రవేశించాలన్న పంతం పట్టటం.. అందుకు భిన్నంగా అక్కడి మత పెద్దలు.. ఆలయ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేయటం చూస్తున్నాం. కానీ.. ఇందుకు భిన్నంగా కేరళకు చెందిన ఒక మసీదు పెద్దలు మాత్రం దాదాపు 1200 ఏళ్లుగా సాగుతున్న సంప్రదాయాన్ని వదిలేసి.. ముస్లింలు తమ మసీదులోకి ప్రవేశించేలా నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.
కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జుమా మసీదులోకి మహిళలకు అనుమతి లేదు. ఈ పురాతన సున్నీ మసీదులోకి వెళ్లేందుకు పలువురు సందర్శకులు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తారు. మసీదు లోపలి శిల్ప నైపుణ్యాన్ని చూడాలని తపించే మహిళలకు.. అనుమతి లేకపోవటం పలువురిని నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని. అందుకే తాము ఒక నిర్ణయాన్ని తీసుకున్నామన్న మసీదు బోర్డు సభ్యులు మౌలావీ సిరాజ్ ఉద్దీన్ మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు మసీదులోకి మహిళల్ని అనుమతించనున్నట్లు వెల్లడించారు.
ఈ రెండు రోజులు పురుషులకు మసీదులోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పలువురు ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. మసీదు పెద్దలు తీసుకున్న నిర్ణయం ఎలాంటి ములుపులు తిరుగుతుందో చూడాలి.