Begin typing your search above and press return to search.
ప్రకాష్ రాజ్ ఏ రాష్ట్రంలో హ్యాపీగా ఉంటాడంటే...
By: Tupaki Desk | 11 Dec 2017 9:47 AM GMTఇటీవలి కాలంలో తనదైన శైలి కామెంట్లతో - వ్యంగ్యాస్త్రాలతో నటుడు ప్రకాష్ రాజ్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. `జస్ట్ ఆస్కింగ్` అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ల ద్వారా ప్రకాష్ రాజ్ పాలకుల తీరును ఎండగడుతున్నారు. అయితే ఈ క్రమంలో ఎక్కువగా అవి కేంద్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నవి అయి ఉంటున్నాయి. రాజకీయాలను పక్కనపెట్టినట్లు ప్రకాశ్ రాజ్ తాజాగా స్పందించినప్పటికీ...కేరళ అంతర్జాతీయ చిత్రోత్సవం (ఐఎఫ్ ఎఫ్ కే) ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించిన తీరు వాటి చుట్టే తిరిగిందంటున్నారు.
ఇంతకీ ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే...తనకు కేరళ అంటే చాలా ఇష్టమని వెల్లడించారు. ఎందుకు ఇష్టమో కూడా ఆయన విపులంగా చెప్పారు. `కేరళలో ఎలాంటి సెన్సార్ భయం ఉండదు. అందుకే నేను కేరళకు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ముందస్తుగా సిద్ధం చేసుకున్న స్కిప్ట్ తీసుకొని రాను. నేను నిర్భయంగా శ్వాస తీసుకోగలిగే రాష్ట్రం కేరళనే` అంటూ కమ్యూనిస్టుల పాలిత రాష్ట్రమైన కేరళను ప్రకాశ్ రాజ్ ప్రశంసించారు. ఈ సందర్భంగానే తాజాగా సినీ పరిశ్రమలో వివాదాస్పదంగా నిలిచిన ఎస్ దుర్గ చిత్రంపై ప్రకాశ్ రాజ్ రియాక్టయ్యారు. ఎస్ దుర్గ సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వ్యక్తులు మిగతా వాటిని ఎందుకు వ్యతిరేకంగా స్పందించట్లేదని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. `దుర్గ వైన్ షాప్ - దుర్గ బార్' వంటి పేర్లున్నప్పటికీ అభ్యంతరం చెప్పడం లేదంటే...వారికి అది సమ్మతం అన్నట్లేనా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో తనకు ఎదురవుతున్న బెదిరింపుల గురించి తనదైన శైలిలో ఆయన స్పందించారు. `నా నోరు మూయించాలనుకునే వారిని చూసి గట్టిగా పాడుతాను. నన్ను బెదిరించే వారిని చూసి నవ్వుతాను. నా హక్కులను వారు దూరం చేయలేరు' అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనకు రాజకీయాలు అంటగట్టే వారికి సైతం ప్రకాశ్ రాజ్ సమాధానం ఇచ్చారు. ` సమాజంలో జరుగుతున్న పరిణామాలపై గొంతెత్తడం ఒక కళాకారుడిగా తన బాధ్యత. అది మాత్రమే నేను నిర్వర్తిస్తున్నాను.నాకు ఎలాంటి రాజకీయ సంస్థలతో సంబంధం లేదు` అని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా మరో సందర్భంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రకాశ్ రాజ్ ఆసక్తికరంగా స్పందించిన సంగతి తెలిసిందే. ``ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల్ని నెరవేర్చే ఉద్దేశం ఉందా? ఇలా వివిధ రాష్ట్రాల ఎన్నికలతో ఎప్పుడూ బిజీగా ఉంటారా?`అని పరోక్షంగా ప్రధాని మోడీని ప్రశ్నించారు. అలాగే ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య నేపథ్యంలో పాలకుల తీరుపై ప్రకాష్ రాజ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అలాగే 'పద్మావతి'చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి మద్దతు ప్రకటించారు.