Begin typing your search above and press return to search.

చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన 261 మందిపై కేసు నమోదు.. 41 మంది అరెస్ట్

By:  Tupaki Desk   |   6 Oct 2020 5:32 PM GMT
చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన 261 మందిపై కేసు నమోదు.. 41 మంది అరెస్ట్
X
దేశవ్యాప్తంగా విధించిన ‘లాక్ డౌన్’ ప్రజలలో డిజిటల్ వినియోగాన్ని పెంచింది. దాంతోపాటు అశ్లీల చిత్రాలు చూడడం కూడా పెంచింది. ముఖ్యంగా మైనర్ పిల్లలతో డార్క్ నెట్ వాడకం బాగా పెరిగిందని తేలింది. ఇలాంటివి పిల్లలలో నేర ప్రవృత్తి పెరగకుండా వారిని మానసిక వైద్యులకు చూపంచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

చైల్డ్ పోర్నో గ్రఫీ.. చిన్నపిల్లలతో అసభ్యకరంగా శృంగారం చేయించే వీడియోలు చూడడం నిషేధం.. ఇది శిక్షార్హం. అలాంటి చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన 268 మందిపై కేసులు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. వీరిలో 41మందిని అరెస్ట్ చేశారు. కేరళ సైబర్ క్రైమ్ సెల్ వారి లెక్కల ప్రకారం లాక్ డౌన్ సమయంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన నిందితులు చైల్డ్ పోర్న్ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్.. డౌన్ లోడ్ చేశారని.. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటిలో ఎక్కువ మంది 6-15 సంవత్సరాలోపు పిల్లలకు సంబంధించిన వీడియోలను వారు అప్లోడ్.. డౌన్ లోడ్ చేసినట్లు గుర్తించారు.

రాష్ట్రవ్యాప్తంగా 3 వారాలపాటు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశామని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. కరోనా ప్రజల ప్రాణాలతోపాటు నేరాలను పెంచిందని అడిషనల్ డీజీపీ మనోజ్ అబ్రహం వ్యాఖ్యానించారు.