Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్ర నేతలు పైసలు తీయనే తీయరట
By: Tupaki Desk | 13 Aug 2016 4:26 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలంటే చాలు.. లక్షలకు లక్షలు వెదజల్లాల్సిన పరిస్థితి. గ్రామ పంచాయితీ మెంబర్ ఎన్నికకు సైతం లక్షల్లోఖర్చు పెట్టే పరిస్థితి. గెలుపు సంగతి తర్వాత.. బరిలో నిలిచిన దానికి ఖర్చు పెట్టే విషయంలో అస్సలు వెనక్కి తగ్గకూడదన్నట్లుగా నేతల వైఖరి కనిపిస్తుంది. కానీ.. కేరళ రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నమట. అక్కడి రాజకీయ నాయకులు జేబులో నుంచి పైసలు తీసేందుకు ఓ పట్టాన అంగీకరించరట.
ఇప్పటి దూకుడు రాజకీయాల్లోనూ ఖర్చు విషయంలో వారితో పోటీ పడే సత్తా మరెవరికీ ఉండదన్నట్లుగా చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను అధ్యయనం చేస్తున్న ఎన్నికల ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తాజాగా కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని బయటపెట్టింది. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారి సరాసరి ఖర్చు రూ.20లక్షల లోపేనని తేల్చారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలంటే ఒక్కో అభ్యర్థి కోట్లలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కానీ.. కేరళలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉందని.. 140 మంది ఎమ్మెల్యేలు ఉన్న కేరళ అసెంబ్లీలో 137 మంది ఎన్నికల సరాసరి ఖర్చు కేవలం రూ.19.64 లక్షలుగా తేల్చారు. ఇక.. 14 మంది ఎమ్మెల్యేలు అయితే.. ఖర్చుచేయాల్సిన మొత్తంలో సగం కూడా ఖర్చు చేయలేదని తేలింది.
సీపీఎం నుంచి ఎన్నికైన 55 మంది ఎమ్మెల్యేల సరాసరి ఖర్చు రూ.19.02 లక్షలు కాగా.. కాంగ్రెస్ కు చెందిన 22 మంది నేతల సరాసరి ఖర్చు రూ.19.26 లక్షలు మాత్రమే. సీపీఎంకు చెందిన సుధాకరన్ అత్యధికంగా రూ.27.82 లక్షలు ఖర్చు చేసినట్లుగా తేల్చారు. అదే సమయంలో ఆ పార్టీకే చెందిన విజయ్ దాస్ రూ.7.85 లక్షలుమాత్రమే ఖర్చు చేయటం గమనార్హం. మరింత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. 48 మంది ఎమ్మెల్యేలు అయితే ఒక్క పైసా కూడా తమ సొంత నిధుల్ని ఎన్నికల కోసం ఖర్చుపెట్టకపోవటం. నోట్లను చిల్లర మాదిరి విసురుతూ అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకునే మన నేతలతో పోలిస్తే కేరళ పొలిటీషియన్లు చాలా చాలా బెటర్ అన్న మాట.