Begin typing your search above and press return to search.
ఇంకో రాష్ట్రంలో పెప్సీ, కోక్ బ్యాన్ చేశారు
By: Tupaki Desk | 9 March 2017 9:25 AM GMTవేసవి వచ్చిందంటే కూల్ డ్రింక్స్ అనగానే కోకాకోలా - పెప్సీ వంటివి గుర్తుకువస్తాయి. అలాంటి కూల్ డ్రింక్స్ ప్రియులకు చేదు వార్త. కేరళ రాష్ట్రంలో నీటి కొరత ప్రభావం కోకాకోలా - పెప్సీ కూల్ డ్రింక్ లపై పడింది. ఈమేరకు ఈ రెండింటిపై నిషేధం విధించారు. ఈనెల 14 నుంచి కోకాకోలా - పెప్పీలపై నిషేధం కొనసాగనుంది. నీటి కొరత వల్లే నిషేధం విధించినట్టు ట్రేడర్స్ తెలిపారు. తమ రాష్ర్టానికి వచ్చే పర్యాటకులు సైతం దీనికి సహకరించాలని కోరారు.
ఇటీవలే తమిళనాడు రాష్ట్రంలోనూ పెప్సీ - కోక్ పై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలోని అతిపెద్ద వాణిజ్య సంఘమైన తమిళనాడు వానిగర్ సంగమ్ పెప్సీ - కోక్ లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. గత జనవరి నెలలో జల్లికట్లు కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా వాణిజ్య సంఘాలు ఈ నిర్ణయం తీసుకొని అమలు చేశాయి. బహుళజాతి కంపెనీలు సాఫ్ట్‌డ్రింక్స్ పెద్ద ఎత్తున తయారు చేసి అమ్మడం వల్ల స్థానిక తయారీదారులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ విదేశీ సంస్థలు విలువైన నీటి సంపదను కూడా దోచుకుంటున్నాయని సంఘం ఆరోపించింది. రాష్ట్రం కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో ఎంఎన్ సీ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీలు నీటిని దోచుకోవడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో తాము ఓ ముందడుగు వేసినట్లు సంఘం ప్రతినిధులు వివరించారు.
అయితే తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పెప్సీ - కోక్ లను రిటెయిలర్లు నిషేధించినప్పటికీ తమిళనాడులోని తమిరపరణి నది నీళ్లను పెప్సీ - కోక్ వాడుకోవచ్చునని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇలా ఉపశమనం వచ్చిన సమయంలోనే కేరళలో తాజా నిషేధం వెలువడం ఆ సంస్థలకు ఆందోళనగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/