Begin typing your search above and press return to search.

ఫేస్‌ బుక్‌ కు చెమటలు పట్టించాడు!

By:  Tupaki Desk   |   27 Sep 2016 4:30 AM GMT
ఫేస్‌ బుక్‌ కు చెమటలు పట్టించాడు!
X
ప్రతిభకు వయసు - భారీ చదువులు ఇవేవీ అడ్డుకాదని నిరూపిస్తూ ఫేస్ బుక్ కే షాకిచ్చినంత పనిచేసిన కేరళ కుర్రాడి తెలివి తేటలకు విస్తుపోయి, భారీ నజరానా అందజేసింది కాలిఫోర్నియాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయం. ఆ నజరానా 32 వేల డాలర్లు... అంటే 21.31 లక్షల రూపాయలన్నమాట. ఈ స్థాయిలో నజరానా పొందేటంత గొప్పపని ఏమిచేసాడబ్బా ఈ కుర్రాడు అనుకుంటున్నారా? అయితే విషయానికెళ్లిపోదాం...

కేరళకు చెందిన అరుణ్‌ ఎస్‌ కుమార్‌ ఒక సాదాసీదా కుర్రాడే.. అతడు ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టిన ప్రొడక్ట్‌ లో సాంకేతిక లోపాలను గుర్తించాడు. ప్రపంచంలోని బెస్ట్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ చేసిన పనిలో లోపాలను గుర్తించాడన్నమాట. ఈ అరుణ్‌ - కంప్యూటర్‌ సైన్స్‌ నాలుగో సంవత్సరం విద్యార్థి. కాగా, చిన్న వ్యాపారుల వాణిజ్య ప్రకటనల కోసం ఫేస్‌ బుక్‌ రూపొందించిన ప్రొడక్ట్‌ లో బగ్స్‌ ను గుర్తించాడు. దీంతో మనోడి తెలివితేటలకు ఫిదా అయిన ఫేస్ బుక్ ఈ భారీ నజరానా ప్రకటించింది. ఈ విషయాలపై స్పందించిన అరుణ్... ఒక విద్యార్థిగా ఇది తనకు చాలా పెద్దమొత్తమే అని అంటూనే. భవిష్యత్తులో ఫేస్‌ బుక్‌ కంపెనీ నుంచి తనకు ఉద్యోగ ఆఫర్‌ కూడా రావొచ్చునని ఆశిస్తున్నాడు.

కాగా, అరుణే కాదు కేరళలో చాలామంది ఇంజినీర్స్ ఇప్పుడు ఇదే ట్రెండ్‌ ను ఫాలో అవుతున్నారు. కంప్యూటర్‌ దిగ్గజాల సాఫ్ట్‌ వేర్లలో లోపాలను వెలికితీసి.. అవి మరింతగా మెరుగుపడేందుకు సహాయపడుతున్నారు. ఫలితంగా.. పెద్దమొత్తంలో నగదు బహుమానాలు అందుకుంటున్నారు. మరి కొందరైతే ఆ భారీ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా సంపాదిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/