Begin typing your search above and press return to search.
బ్రెగ్జిట్ పై అమెరికా కామెంట్లు చూశారా?
By: Tupaki Desk | 29 Jun 2016 10:14 AM GMTయురోపియన్ యూనియన్ తో విడిపోవాల్సిందేనని బ్రిటన్ ప్రజలు విస్పష్టంగా తీర్పు చెప్పినా ఓ అమెరికా పెద్దాయన మాత్రం అది జరిగే పని కాదేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనేమీ సాధారణ వ్యక్తి కాదు. అమెరికా విదేశాంగశాఖ మంత్రి జాన్ కెర్రీ. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తో సమావేశమైన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే అంశంపై ఈయూతో ఎలా సంప్రదింపులు జరుపాలని కామెరాన్ తనతో అన్నట్లు కెర్రీ వెల్లడించారు. #ఈ విడాకుల ప్రక్రియ ఎంతో సంక్లిష్టమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 50 ప్రక్రియ మొదలుపెట్టడానికి కామెరాన్ ఏమాత్రం ఇష్టపడటం లేదు. బ్రిటన్ ఈయూ నుంచి బయటకు వెళ్లాలనుకోవడం లేదని కెర్రీ వివరించారు.
ఇష్టం లేని పని ఎలా చేయాలో కామెరాన్ కు అర్థం కావడం లేదని, అలాగే బ్రెగ్జిట్ ను కోరుకున్నవారికి కూడా ఇది అంతుబట్టడం లేదని జాన్ కెర్రీ అన్నారు. కామెరాన్ స్థానంలో ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్న బోరిస్ జాన్సన్ ను ఉద్దేశించి కెర్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి బ్రెగ్జిట్ పై బ్రిటన్ వెనకడుగు వేస్తుందా, వేస్తే ఎలా అని కెర్రీని ప్రశ్నించగా.. దానికి అనేక మార్గాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఓ దేశ విదేశాంగ మంత్రిగా తాను ఆ విషయాలను వెల్లడించలేనని చెప్పారు. నిజానికి బ్రెగ్జిట్ ను అమెరికా కూడా కోరుకోలేదు. అయితే ఈయూ నుంచి విడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో లండన్ - ఈయూ మధ్య సత్సంబంధాలు ఉండేలా చూసేందుకు అగ్రరాజ్యం ప్రయత్నిస్తోంది.