Begin typing your search above and press return to search.
టైమిస్తే చాలు తప్పు సరిదిద్దుకుంటానంటున్నాడు
By: Tupaki Desk | 10 Sep 2015 10:18 AM GMTపీకల్లోతు ఆర్థికకష్టాల్లో కూరుకుపోయిన కేశవరెడ్డి విద్యా సంస్థల అధిపతి కేశవరెడ్డి తన తప్పును ఒప్పుకున్నారు. విద్యార్థుల నుంచి సేకరించిన డిపాజిట్లను తిరిగి ఇచ్చే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని చెప్పిన ఆయన.. తాను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రవేశ పెట్టిన స్కీంలో భాగంగా వారి వద్ద నుంచి సేకరించిన డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇచ్చే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం.. ఇందులో భాగంగా పలు కేసులు ఆయనపై నమోదయ్యాయి.
డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించే విషయంలో నెలకొన్న ఇబ్బుందుల నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా.. ఆయన్ను కర్నూలు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని.. అప్పులకు సరిపడా ఆస్తులు ఉన్నాయని.. వాటి మొత్తాన్ని ఇప్పటికిప్పుడు అమ్మేయటం సాధ్యం కాని నేపథ్యంలో తనకు కాస్తంత సమయం ఇస్తే.. తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేస్తానని చెబుతున్నారు. తాను తప్పు చేశానని.. దాన్ని సరిదిద్దుకునేందుకు కాస్త సాయం చేయాలంటూ కేశవరెడ్డి చేసిన విన్నపానికి చట్టం ఎలా స్పందిస్తుందో..?