Begin typing your search above and press return to search.
టీడీపీలో ఇంటిపోరు.. కేశినేని నాని వర్సెస్ బుద్దా వెంకన్న..!
By: Tupaki Desk | 18 Feb 2021 10:30 AM GMTబెజవాడ కేంద్రంగా టీడీపీ అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఇక్కడ మొదటి నుంచి కేశినేని నానికి బుద్దా వెంకన్నకు మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే. కొంతకాలం పాటు నాని.. టీడీపీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే విజయవాడలోని పలువురు టీడీపీ నేతలతోనే ఆయనకు పడటం లేదు. తాజాగా నాని విజయవాడలో డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న వర్గీయులు నానిని అడ్డుకున్నారు. ఇతర పార్టీల నేతలను టీడీపీలో ఎలా చేర్చుకుంటారంటూ నిలదీశారు. కేశినానిని వాళ్లు బూతులు తిట్టారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన నాని.. అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.
గతంలో మన అధినేత చంద్రబాబునాయుడు కూడా ఇతరపార్టీల నేతలను కలుపుకున్నారు. చంద్రబాబు చేసింది తప్పైతే నేను చేసింది కూడా తప్పే.. అయినా పార్టీలో ఎవరు తప్పుచేసినా వెళ్లి అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇలా నడిరోడ్డుపై అల్లరి చేస్తే ప్రయోజనం ఉండదంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు.
మరోవైపు విజయవాడలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కేశినేని నానికి పార్టీలోని బెజవాడ లీడర్లంతా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఓ వైపు పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. చాలా చోట్ల టీడీపీ ఉనికి కూడా చాటుకోలేకపోయింది. ఓ వైపు పార్టీ బలహీన పడుతుంటే.. మరోవైపు సొంతపార్టీ లోనూ లుకలుకలు మొదలయ్యాయి.