Begin typing your search above and press return to search.

చ‌ల్లార‌ని కేశినేని నాని.. ఢిల్లీలో బాబుతో అలా ప్ర‌వ‌ర్తించారా?

By:  Tupaki Desk   |   6 Aug 2022 8:00 AM GMT
చ‌ల్లార‌ని కేశినేని నాని.. ఢిల్లీలో బాబుతో అలా ప్ర‌వ‌ర్తించారా?
X
విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఆయ‌న సొంత త‌మ్ముడు కేశినేని చిన్నిల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. 2014, 2019ల్లో విజ‌య‌వాడ నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు.. కేశినేని నాని. అయితే విజ‌య‌వాడ‌లో త‌న‌కు వ్య‌తిరేకులైన బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరాల‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ ప్రోత్స‌హిస్తున్నార‌ని మొద‌టి నుంచి ఆగ్ర‌హంగా ఉన్నారు. విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ విభేదాలు రోడ్లెక్కాయి. కేశినేని నాని కుమార్తె శ్వేత టీడీపీ త‌ర‌ఫున మేయ‌ర్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. అయితే ఆమె అభ్య‌ర్థిత్వాన్ని మొద‌ట బుద్ధా, నాగుల్ మీరా వ‌ర్గాలు ఒప్పుకోలేదు.

ఆ త‌ర్వాత వీరితో త‌న‌కు అస‌మ్మ‌తి చాల‌ద‌న్న‌ట్టు త‌న సోద‌రుడు కేశినేని చిన్నిని త‌న‌పైకి ఎగ‌దోస్తున్నార‌ని కేశినేని నాని క‌ల‌త చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తిసారీ టీడీపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను విజ‌య‌వాడ నుంచి పోటీ చేయ‌బోన‌ని కేశినేని నాని.. చంద్ర‌బాబుకు చెప్పార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో కేశినేని చిన్నిని విజ‌య‌వాడ లోక్ స‌భ‌కు టీడీపీ బరిలోకి దించే ఆలోచ‌న‌లో ఉంద‌ని అంటున్నారు.హైద‌రాబాద్ లో ఉంటూ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కేశినేని చిన్న కార్య‌క‌లాపాలు ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల విజ‌యవాడ‌లో పెరిగాయ‌ని అంటున్నారు. తాజాగా విజ‌య‌వాడ వ‌చ్చిన కేశినేని చిన్ని.. మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాతో మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ జ‌రిపారు. అంటే ఆయ‌న త‌న‌ప‌నిని మొద‌లుపెట్టేసిన‌ట్టేన‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ లో పాల్గ‌నడానికి చంద్ర‌బాబు ఢిల్లీ వ‌చ్చిన సంద‌ర్భంగానూ ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చంద్ర‌బాబుకు ఢిల్లీ విమానాశ్ర‌యంలో తెలుగుదేశం ఎంపీలు స్వాగ‌తం ప‌లికారు. వీరితోపాటు కేశినేని నాని కూడా వచ్చారు. అయితే గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్.. చంద్ర‌బాబుకు శాలువా క‌ప్పారు. కేశినేని నానికి పుష్ప‌గుచ్ఛం ఇచ్చి చంద్ర‌బాబుకు ఇవ్వాల‌ని కోర‌గా దాన్ని కేశినాని నాని చంద్ర‌బాబుకు ఇవ్వ‌కుండా విసిరికొట్టార‌ని ప్ర‌చారం సాగుతోంది. బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ ప్రాధేయ‌ప‌డ్డ‌ప్ప‌టికీ నాని ఏమాత్రం పట్టించుకోలేద‌ని చెబుతున్నారు.

ఇలా ఢిల్లీలోనూ కేశినాని నాని చంద్ర‌బాబుతో ఎడ ముఖం పెడ ముఖంగా వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు. చంద్ర‌బాబుకు బొకే ఇవ్వ‌క‌పోవ‌డంపై ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంద‌ని చెప్పుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో కేశినేని నాని.. త‌న సోద‌రుడు చిన్నికి త‌ప్ప ఎవ‌రికైనా సీటు ఇవ్వాల‌ని కోరుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే ప్ర‌స్తుతం కార్పొరేటర్ గా ఉన్న త‌న కుమార్తె శ్వేత‌ను ఎమ్మెల్యేగా నిల‌బెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఒక‌వేళ టీడీపీ సీటు ఇవ్వ‌కుంటే వైఎస్సార్సీపీ త‌ర‌ఫున అయినా త‌న కుమార్తెను నిల‌బెట్ట‌డానికి కేశినేని నాని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.