Begin typing your search above and press return to search.
కేశినేని నానికి సుజనా గాడ్‌ఫాదరా?
By: Tupaki Desk | 8 July 2015 5:17 AM GMTవిజయవాడ ఎంపీ కేశినేని నాని గత రెండు రోజులుగా హాట్ టాపిక్‌గా మారారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టి.. ఏపీ ఎంపీల్ని తిట్టే కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని పేరును ప్రత్యేకంగా ప్రస్తావించి ఆయన తీరుపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికి ధీటుగా అన్నట్లుగా మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టిన కేశినేని నాని.. పవన్‌పై ఓ రేంజ్ లో ధ్వజమెత్తారు.
ఈ ప్రెస్‌మీట్‌లో ఒక ఆసక్తికర అంశం కనిపించింది. కేశినేని నోటి నుంచి వచ్చిన మాటల్లో చాలా ఎక్కువ సందర్భాల్లో కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రస్తావన వచ్చింది. బాబుకు అత్యంత సన్నిహితుడని పేరున్న సుజనా చౌదరికి పార్టీలో ఎంతటి ప్రాధాన్యత ఉందన్న విషయం కేశినేని నాని మాటల్లో స్పష్టంగా కనిపిస్తుది.
ఒకవిధంగా చెప్పాలంటే.. కేశినేని పెట్టిన ప్రెస్‌మీట్‌లో ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు కంటే కూడా సుజనా చౌదరి పేరును ఎక్కువసార్లు ప్రస్తావించినట్లుగా కనిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో అధినేత సంగతి తర్వాత.. సుజనా తన గాడ్‌ఫాదర్ అన్నట్లుగా కేశినేని నాని వ్యాఖ్యలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి.. కాస్త ఎక్కువ కడిగేసిన వారిలో కేంద్రమంత్రి సుజనా.. ఎంపీ కేశినేని నాని ఉండటం గమనార్హం.
తాజా ప్రెస్‌మీట్‌లో సుజనా చౌదరిని పదే పదే ప్రస్తావిస్తూ.. ఆయన నేతృత్వంలో తాము నడుస్తామని నాని చెప్పటం సాంకేతికంగా తప్పు కాకపోవచ్చు. కేంద్రమంత్రిగా ఉన్న ఆయనకు ఆ మాత్రం ప్రాధాన్యత ఇవ్వటంలో తప్పు లేదు. కానీ.. మరో కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ఉన్నప్పటికీ.. ఆయనతో పేరును ప్రస్తావించటంతో పోలిస్తే.. సుజనా పేరును పదే పదే ప్రస్తావించటం కనిపిస్తుంది. తాజా ప్రెస్‌మీట్ పుణ్యమా అని కేశినేని నాని వెనుక ఉన్న గాడ్‌ఫాదర్ ఎవరో అర్థమైపోయిందన్న మాట వినిపిస్తోంది. లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక.