Begin typing your search above and press return to search.
జంపింగ్ తమ్ముళ్లకు చురకేసిన కేశినేని!
By: Tupaki Desk | 6 July 2019 8:25 AM GMTవిజయవాడ ఎంపీగా రెండోసారి గెలిచిన నాటి నుంచి కేశినేని నాని తీరు మారింది. గతానికి భిన్నంగా ఆయన సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా మారారు. పార్టీ అధినేత చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా కొన్ని పోస్టులు పెట్టటం ద్వారా ఆయన ఒక్కసారిగా అందరి నోట్లో నానారు. ఎన్నికల్లో పార్టీ పరాజయంపై కీలక వ్యాఖ్యలు చేయటం ద్వారా హాట్ టాపిక్ గా మారారు.
అప్పటినుంచి తరచూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్టు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి.. సీఎం రమేశ్.. టీజీ వెంకటేశ్ లకు చురకలు వేస్తూ ఆయన వ్యంగ్యస్త్రాల్ని సంధించారు.
ఏపీని ఉద్దరించటానికి బీజేపీలోకి వెళుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చిన జంపింగ్ నేతల అసలు రంగేమిటో తాజా బడ్జెట్ చూస్తే అర్థమైందన్నారు. మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్దరించటానికి బీజేపీలోకి వెళ్తున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ.. నిన్న బడ్జెట్ చూశాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది. ఈ రాష్ట్రాన్ని ఉద్దరించటానికి బీజేపీలోకి వెళ్లారో లేక మిమ్మల్ని మీరు ఉద్దరించుకోవటానికి చేరారో అర్థమైందని పోస్టు పెట్టారు.
మొన్నటివరకూ భుజాలు.. భుజాలు రాసుకుపూసుకు తిరిగి నేతలపై ఈస్థాయిలో విమర్శలు చేయటం ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీసేలా కేశినేని నాని పోస్టు ఉందని చెప్పక తప్పదు. ఏపీ ప్రజల్ని ఉద్దరించటానికే తాము పార్టీ మారామన్న మాట మళ్లీ మాట్లాడకుండా చేసేలా తాజా పోస్ట్ ఉందన్న మాట వినిపిస్తోంది.