Begin typing your search above and press return to search.

బాబుకు ముందు గొయ్యి-వెనుక నుయ్యి..కేశినేని నాని ఇరికించేశాడా..!

By:  Tupaki Desk   |   15 July 2019 6:04 AM GMT
బాబుకు ముందు గొయ్యి-వెనుక నుయ్యి..కేశినేని నాని ఇరికించేశాడా..!
X
రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు.. అన్న విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు విజ‌య‌వాడ నుంచి టీడీపీ గుర్తుపై గెలిచిన ఎంపీ కేశినేని నాని. ఆయ‌న వ్య‌వ‌హార శైలి పూర్తి తీవ్ర వివాదానికి దారితీస్తోంది. అస‌లే పార్టీ ఓట‌మితో నానా తిప్ప‌లు ప‌డుతోంది. ఈ క్ర‌మంలో పార్టీని బ‌తికించుకునేందుకు కీల‌క‌మైన విజ‌య‌వాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని చ‌ర్య‌లు తీసుకోకుండా.. పార్టీని మ‌రింత బ‌ల‌హీన ప‌రిచే దిశ‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల అనంతరం పార్టీని ఉద్దేశపూర్వకంగానే మాజీ మంత్రి దేవినేని ఉమా ఓడించార‌నే అర్ధం వ‌చ్చేలా ట్వీట్ల ప‌రంపర‌ను కొన‌సాగించారు నాని.

త‌ర్వాత ఇప్పుడు ఆయ‌న త‌న ట్వీట్ బాణాల‌ను విజ‌య‌వాడ టీడీపీ న‌గ‌ర అధ్య‌క్షుడు బుద్దా వెంక‌న్న‌పై ప్ర‌యోగించారు. ఈక్ర‌మంలోనే ఇప్పుడు వివాదాన్ని తార‌స్థాయికి చేర్చారు. నేరుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబునే కేశినేని ఇరుకున పెట్టే శారు. నిన్నటి వ‌ర‌కు సాగిన ట్వీట్ల ప‌ర్వంలో తాజాగా కేశినేని నాని బుద్దాకు కౌంట‌ర్ ఇవ్వ‌డం మానేసి.. నేరుగా చంద్ర‌బాబుకే అల్టిమేటం జారీ చేశారు. తాను పార్టీలో ఉండాలా? వ‌ద్దా? తేల్చి చెప్పాలంటూ సోమ‌వారం ఉద‌యం ఆయ‌న ట్వీట్ చేశారు. వ‌ద్దంటే.. పార్టీ స‌భ్య‌త్వానికి - ఎంపీగా ప్ర‌జ‌లు ఇచ్చిన ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తాన‌ని చెప్పారు.

లేదు.. పార్టీలో నేను కావాలంటే.. ``మీ పెంపుడు కుక్క‌ని అదుపులో పెట్టండి`` అని అత్యంత వివాదాస్పద వ్యాఖ్య చేశారు. నేరుగా ఈ వ్యాఖ్య బుద్ధా వెంక‌న్న‌నే అన్న‌ట్టుగా భావించాల్సి వ‌స్తుంది. ప్ర‌స్తుతం నాని వ‌ర్సెస్ బుద్దాల మ‌ధ్యే వివాదం నడుస్తున్న నేప‌థ్యంలో ఖ‌చ్చితంగా బుద్దాను ఉద్దేశించి కేశినేని ఇలా వ్యాఖ్యానించ‌డం.. ఇప్పుడు రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. బీసీ వ‌ర్గానికి చెందిన బుద్దా వెంక‌న్న‌ను కుక్క‌తో పోల్చ‌డంపై ఆ వ‌ర్గం తీవ్ర ఆందోళ‌న‌కు దిగే ఛాన్స్ స్ప‌ష్టంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు బీసీ వ‌ర్గాన్ని ఓన్ చేసుకున్న టీడీపీ.. ఆ వ‌ర్గం ఓట్ల‌తోనే తాను అధికారంలోకి వ‌చ్చాన‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పుకొన్నారు.

బీసీలే త‌మ‌కు అండ‌ని కూడా వెల్ల‌డించారు. అలాంటి వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కుడు - పార్టీ విజ‌య‌వాడ అధ్య‌క్షుడు బుద్దా ను కుక్క‌తో పోల్చి - దీనిని చంద్ర‌బాబు కోర్టులోకి వ్యూహాత్మ‌కంగా నెట్టారు కేశినేని. మ‌రి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఏదేమైనా.. విప‌క్షాల‌కు కూడా ఇప్పుడు ఛాన్స్ ఇచ్చిన‌ట్టుగానే భావించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. బీసీల‌ను కుక్క‌ల‌తో పోల్చిన పార్టీ అంటూ.. వారు ఇప్పుడు యాగీ చేస్తే.. స‌మాధానం చెప్ప‌డం బాబుకు త‌రం అవుతుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.