Begin typing your search above and press return to search.

నవ్వినా తట్టుకోలేకపోతే ఎలా కేశినేని?

By:  Tupaki Desk   |   18 Dec 2019 10:49 AM GMT
నవ్వినా తట్టుకోలేకపోతే ఎలా కేశినేని?
X
ఎక్కడైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటే అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరావేశంతో ఊగిపోతుంటే ఇలా చేయటమా? అని ప్రశ్నిస్తారు. అదే సిత్రమో కానీ.. ఏపీలో టీడీపీ నేతలు ముఖ్యమంత్రి నవ్వినా ఫీలైపోతున్న వైనం చూస్తే.. వారి ఆలోచన ధోరణి ఎలా ఉందన్న సందేహం కలుగక మానదు. ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు నవ్వటమే రాదన్న పేరున్న సంగతి తెలిసిందే. మనసారా నవ్వితే సంతోషమే కాదు.. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

చంద్రబాబులోని నవ్వని తత్త్వాన్ని పలువురు చెప్పినా ఆయన తన తీరును మార్చుకోవటానికి ఇష్టపడరు. ఏదో కోల్పోయినట్లుగా ఆయన వ్యవహరిస్తుంటారు. తమ బాస్ ను చూసి.. చూసి అలవాటైన తెలుగు తమ్ముళ్లకు ఎవరైనా మనసారా నవ్వినా ఓర్చుకోలేనట్లుగా ఉంటుందా? అంటే అవునన్నట్లుగా అనిపిస్తోంది.

మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లోపలు సందర్భాల్లో జగన్ హాయిగా నవ్వటం పలువురిని ఆకర్షించింది. ఇలా ఉండటం అప్పట్లో వైఎస్ కు.. ఇప్పుడు జగన్ కు మాత్రమే సాధ్యమన్న మాట పలువురి నోట వినిపిస్తుంటుంది.ఎప్పటికప్పుడు తమ మాటలతో.. చేతలతో సెల్ప్ గోల్ కొట్టుకునే తెలుగు తమ్ముళ్ల తీరు నవ్వు తెప్పించేలా ఉంటుంది. దీంతో.. వచ్చిన నవ్వును ఆపుకోకుండా హాయిగా నవ్వేస్తుంటారు సీఎం జగన్.

అయితే.. ఏపీలో మూడు రాజధానులపై జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యువనేత నవ్వుతూ ఉన్న వీడియోను పోస్టు చేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. హాయిగా నవ్వుతూ ఉన్న వీడియోపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరు చూస్తే.. నవ్వటం కూడా తప్పన్నట్లుగా నాని తీరు ఉందని చెప్పాలి. నవ్వటం తెలీని తమ అధినేతను చూసి.. చూసి అలవాటైన నానికి నవ్వుతూ ఉండే జగన్ తీరుకు కేశినేని తట్టుకోలేకపోతున్నారా? అన్న భావన కలగటం ఖాయం. నవ్వుతూ ఉండే జగన్ వీడియో పోస్టు చేసి.. నాలుగు ఉడుకుపోతు మాటలు సంధిస్తే ప్రయోజనం ఉంటుందా నాని మాష్టారు?