Begin typing your search above and press return to search.

కేశినేని నాని డౌట్.. కాస్త వెయిట్ చేస్తే తెలిసేదిగా!

By:  Tupaki Desk   |   28 Jun 2019 7:56 AM GMT
కేశినేని నాని డౌట్.. కాస్త వెయిట్ చేస్తే తెలిసేదిగా!
X
ప‌ని మొద‌లెట్ట‌గానే ఫ‌లితం ఎలా ఉంటుందో చెప్ప‌టం క‌న్నా.. కాస్త వెయిట్ చేస్తే విష‌యం అర్థ‌మ‌వుతుంది. కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట వ‌ద్ద అక్ర‌మంగా నిర్మించిన నిర్మాణాల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం ఎంత క‌టువుగా వ్య‌వ‌హ‌రిస్తుందో తెలిసిందే. జ‌ల‌శయాల ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా.. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప్ర‌భావితం చేసేలా ఉండేక‌ట్ట‌డాల విష‌యంలో తొలుత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌టం ద్వారా.. భ‌విష్య‌త్తులో అలాంటి సాహ‌సానికి మ‌రెవ‌రూ చేయ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత ప్ర‌భుత్వ భ‌వ‌నాన్నే కూల్చివేయ‌టం ద్వారా.. ఎవ‌రి భ‌వ‌న‌మైనా స‌రే.. అది అక్ర‌మం అయితే చాలు.. అంతే సంగ‌తుల‌న్న సంకేతాన్ని ఇచ్చేశారు.

ఇదిలా ఉంటే.. త‌ర‌చూ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై కౌంట‌ర్లు వేసేలా ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్న విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని తాజాగా మ‌రోసారి త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. అక్ర‌మ‌క‌ట్ట‌డాల మీద సీఎం జ‌గ‌న్ ను ఉద్దేశించి ఆయ‌నో పోస్ట్ చేశారు. గౌర‌వ ముఖ్య‌మంత్రిగారు.. నదీ తీర ప్రక్షాళన కేవలం అరవై - డెబ్భై అక్రమ కట్టడాలకు మాత్రమే పరిమితం చేస్తారా? లేకపోతే మన రాష్ట్రంలో కృష్ణా మరియు గోదావరీ నదీ పరీవాహక ప్రాంతాల్లో మన రాష్ట్ర సరిహద్దు నుండి మొదలుపెట్టి ఆ నదులు సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి అన్ని అక్రమ కట్టడాలను రివర్ కన్సర్వేటివ్ యాక్ట్ ప్రకారం తొలగిస్తారా! .. కొంచెం రాష్ట్ర ప్రజలకు వివరించగలరు" అని కేశినేని తన ఫేస్‌ బుక్‌ లో రాసుకొచ్చారు.

కేశినేని నాని ప్ర‌శ్న‌కు స‌మాధానం కాస్త స‌మ‌యం వెయిట్ చేస్తే తెలుస్తుంది. నాని ప్ర‌శ్నించ‌టంలో వెనుక రాజ‌కీయం అర్థం కానిదేమీ కాదు. కాకుంటే.. ప్ర‌భుత్వం చేసే మంచి ప‌నులకు బ్రేకులు వేసే పాత ఐడియాల‌ను ప‌క్క‌న పెట్టి..కాస్త ఫ్రెష్ గా ఆలోచిస్తే మంచిందంటున్నారు. అక్ర‌మ‌క‌ట్ట‌డాల‌ను కూల్చివేత విష‌యంలో బాధ్య‌త క‌లిగిన నేత‌లు మ‌రిన్ని చ‌క్క‌టి ఐడియాలు ఇవ్వాల్సింది పోయి.. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యేలా పోస్టులు పెట్ట‌టం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? అన్న‌ది ప్ర‌శ్న‌. అన్నింటికి స‌మాధానాలు దొరుకుతాయి.. కాకుంటే కాస్త వెయిట్ చేస్తే స‌రిపోతుందంటూ కొంద‌రు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.