Begin typing your search above and press return to search.
జగన్ ఇన్విటేషన్ పంపితే వచ్చేవాడట!
By: Tupaki Desk | 30 May 2019 5:32 AM GMTగన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం భారీస్థాయిలో జరగనుంది. జగన్ ప్రమాణస్వీకారోత్సవాన్ని చూసేందుకు జగన్ అభిమానులు ఏపీ మొత్తమేకాదు.. తెలంగాణ ప్రాంతం నుంచి రావటం కనిపిస్తోంది. ప్రమాణస్వీకారోత్సవానికి రెండు గంటల ముందు నుంచే విజయవాడ రోడ్లు మొత్తం జనసందోహంతో నిండిపోయాయి. ప్రమాణస్వీకారం చేసే ఇందిరాగాంధీ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు.
ఇదిలా ఉంటే.. జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి తనను ఆహ్వానించలేదని వెల్లడించారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. తాజాగా ముగిసిన ఎన్నికల్లో జగన్ కు ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చారన్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న అంశాల్ని జగన్ పూర్తిగా నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నా నాని.. జగన్ ప్రమాణోత్సవానికి తనకు ఎలాంటి పిలుపు రాలేదని చెప్పారు.
జగన్ కు అభినందనలుతెలిపేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఒకటి సిద్ధమైందని.. కాకుంటే జగన్ అపాయింట్ మెంట్ ఇప్పటివరకూ ఖరారు కాలేదని చెప్పారు.జగన్ ను అభినందించటానికి వెళ్లే టీడీపీ బృందంలో అచ్చెన్నాయుడు.. పయ్యావుల కేశవ్.. గంటా శ్రీనివాసరావు ఉన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి జగన్ వెంట ఆయన తల్లి విజయమ్మ.. సతీమణి భారతి.. ఇద్దరు కుమార్తెలు హర్ష.. వర్ష వస్తున్నారు. జగన్ వెంట ఆయన కుటుంబ సభ్యులు.. బంధువులు కూడా స్టేడియంకు రానున్నారు.