Begin typing your search above and press return to search.
కేశినేని స్వామి భక్తి!... లోకేశ్ కు ఆ సత్తా ఉందట!
By: Tupaki Desk | 10 Jan 2019 9:18 AM GMTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రి అయిన నారా లోకేశ్ కు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పుత్రరత్నమన్నది అందులో అన్నింటి కంటే అతి పెద్ద ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఆధారంగానే ప్రత్యక్ష ఎన్నికల్లో లేశ మాత్రం అనుభవం లేకున్నా... ఏకంగా రాష్ట్ర స్థాయిలోని పెద్దల సభలోకి అడుగుపెట్టడమే కాకుండా... ఆ మరుక్షణమే మంత్రిగానే పదవీ బాధ్యతలు చేపట్టేశారు. అయినా ఓ కీలక పార్టీకి చెందిన అధ్యక్షుడి పుత్రరత్నం... పొలిటికల్ ఎంట్రీ ఇంత చడీచప్పుడు లేకుండా, ఇలా దొడ్డిదారిలో జరిగిపోయిందా అన్న విషయం పై పెద్ద ఎత్తున విమర్శలతో పాటు విశ్లేషణలు సాగాయి. అయినా విమర్శలను ఎంతమాత్రం పట్టించుకునే లక్షణం లేని నారా ఫ్యామిలీ... ఇదంతా గిట్టని వారు చేసే పనేనంటూ ముఖం తుడిచేసుకున్న వైనమూ మనకు తెలిసిందే. అయితే అప్పటిదాకా తన పార్టీ పుట్టినే ముంచేలా చాలా సందర్భాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చినబాబు.. పార్టీ శ్రేణులకు బిగ్ షాక్ ఇచ్చారు.
అయితే ఎమ్మెల్సీగా, మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అయినా లోకేశ్ తన తీరు మార్చుకుని, తన సత్తాను పెంచుకునే యత్నం చేస్తారులే అని తెలుగు తమ్ముళ్లు ఆశించారు. అయితే వారి ఆశలను అడియాశలు చేస్తూ... నా తీరింతే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రసంగాలత్లో మరింతగా దిగజారిపోయిన లోకేశ్... ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్తంత యాక్టివేట్ అయిపోయారు. ఎలాగూ జనం ముందు మాట్లాడటం రాదు కదా... కనీసం కాస్తంత విషయ పరిజ్ఞానం ఉన్న సిబ్బందిని నియమించేసుకుని ఇప్పుటు సోషల్ మీడియాలో బాగానే యాక్టివేట్ అయ్యారు. ఈ మాత్రం దానికే మా చినబాబుకు సీఎం అయ్యే సత్తా ఉంది అంటూ తెలుగు తమ్ముళ్లు రాగాలు తీయడం ప్రారంభించేశారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసింది... ఏ చిన్నా చితక నేతో కాదు సుమా. విజయవాడ ఎంపీగా ఉంటూ... కృష్ణా జిల్లా టీడీపీ శాఖకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త కేశినేని నాని నోట ఈ తరహా వ్యాఖ్యలు వినిపించాయి.
అప్పటిదాకా తన కేశినేని ట్రావెల్స్ ను లాభాల బాటలో నడిపించి, తాతలు, తండ్రుల నుంచి సంక్రమించిన వారసత్వ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా విస్తరించుకుంటూ వచ్చిన నాని... టీడీపీ పుణ్యమా అని తన వ్యాపారాన్ని ఇప్పుడు ఏకంగా మూసేసుకున్నారు. మరి ఇంకేం చేయాలి? రాజకీయాలనే పట్టుకుని వేలాడాలి? టీడీపీలో చిరకాలం కొనసాగాలంటే... నారా ఫ్యామిలీకి స్తుతి కీర్తనలు వినిపిస్తూ సాగాల్సిందే కదా. అదే వాస్తవాన్ని గ్రహించిన నాని... ఇప్పుడు చినబాబును ఆకాశానికెత్తేస్తూ ప్రకటనలు గుప్పించడం ప్రారంభించేశారు. ఈ స్తుతి కీర్తనలు ఎంతదాకా వెళ్లాయంటే... మంత్రిగానూ తనను తాను ప్రూవ్ చేసుకోలేని నారా లోకేశ్ లో ఏకంగా సీఎంగా సత్తా చాటే లక్షణాలున్నాయని చెప్పేదాకా. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడులో బుధవారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో మైకందుకున్న నాని... ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ కు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అర్హత నూరు శాతం ఉందన్నారు. ఈ ఒక్క మాటతో చినబాబును ఆకాశానికెత్తేసిన నాని... తాను కూడా ఇతర తెలుగు తమ్ముళ్ల మాదిరే జాకీలేసే నేతనేనని నిరూపించుకున్నారు. మరి ఈ మాట లోకేశ్ చెవిన పడిందో? లేదో? చూడాలి.