Begin typing your search above and press return to search.
టీడీపీకి గెలుపు సెంటిమెంట్ చెప్పిన కేశినేని
By: Tupaki Desk | 18 Jan 2023 2:30 AM GMTసెంటిమెంట్ అన్నది అన్ని రంగాలలో ఆక్సిజన్ లా పనిచేస్తుంది. రాజకీయాల్లో అది ఒక పాలు ఎక్కువే ఉంటుంది. సెంటిమెంట్ ని కాదని నాయకులు ఏ పనీ చేయరు. అలాంటి సెంటిమెంట్ రస గుళికను ఒక దాన్ని తెలుగుదేశం బెజవాడ ఎంపీ కేశినేని నాని వదిలారు. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటోంది.
దాని కోసం ఎన్నో సర్వేలు చేయించుకుంటోంది. మరెన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే సొంత పార్టీ ఎంపీ కేశినేని ఒక సెంటిమెంట్ ని చెప్పుకొచ్చారు. అది ఒక్కటి జరిగితే చాలు ఏపీలో తెలుగుదేశం పవర్ లోకి వచ్చేసినట్లే అని ఆయన జోస్యం చెప్పేశారు. అదేంటి అంటే బెజవాడలోని పశ్చిమ సీటు తెలుగుదేశం పరం అయితే చాలుట.
ఇక ఎలాంటి బెంగా బెరుకూ లేకుండా ఏపీలో తెలుగుదేశం జెండా ఎగిరినట్లే అని ఆయన అంటున్నారు. పశ్చిమలో గెలిచిన అభ్యర్ధి పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఈసారి సరైన అభ్యర్ధిని విజయవాడ పశ్చిమలో నిలబెట్టాలని ఆయన కోరుకున్నారు.
నిజంగా మంచి అభ్యర్ధిని పోటీకి పెడితే పశ్చిమలో తెలుగుదేశం పార్టీ పాతిక వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది అని పక్కాగా కేశినేని చెప్పేశారు. అయితే ఆ అభ్యర్ధి సమర్ధుడు మాత్రమే కాదు నీతి నిజాయతీ, క్యారక్టర్ ఉన్న వారు అయి ఉండాలని ఆయన వైసీపీ అధినాయకత్వానికి షరతు పెడుతున్నారు
ఇక పశ్చిమ నియోజకవర్గంలో ఎవరికి పదవులు ఇవ్వాలో తాను చెప్పనని అది అధినాయకత్వం జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నారు. అంతే కాదు చాలా తొందర్లోనే విజయవాడలోని అన్ని డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉంటాయని కేశినేని అంటున్నారు.
మొత్తానికి తెలుగుదేశానికి తీపిని ఇచ్చే కబురు చెబుతూనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్ధిని సకల గుణాభిరాముణ్ణి పోటీకి పెట్టాలని సలహా ఇచ్చారు. మరి ఆ రాముడు ఎవరో కేశినేనికి తెలుసా. ఆయన మనిషి ఎవరైనా ఉన్నారా అంటే ఎంపీ గారు ఏమీ చెప్పడంలేదు. అదే టైం లో ఆయన తాను ఎవరికీ పదవులు ఇవ్వాలని చెప్పను అని కూడా చేతులు దులుపుకున్నారు.
అంటే తెలుగుదేశం అధినాయకత్వమే అన్నీ చూసుకుని ఆచీ తూచీ అభ్యర్ధిని సెలెక్ట్ చేయాలి అన్న మాట. ఆ అభ్యర్ధి కేశినేని నానికి నచ్చితేనే పాతిక వేల మెజారిటీ వస్తుంది. అపుడు ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. మొత్తానికి కేశినేని మనసులోకి దూరి తెలుగుదేశం అధినాయకత్వం ఆలోచించాలన్న మాట. ఒక చేత్తో ఊరిస్తూ మరో చేత్తో అతి పెద్ద పజిల్ ఇచ్చేశారు. ఎంతైనా కేశినేనా మజాకానా. సో ఇపుడు టీడీపీ హై కమాండ్ కి పశ్చిమ కంటినిండా నిదుర పట్టనీయని నియోజకవర్గం అవుతుందా అంటే ఏమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.